Women's World Cup: సెమీస్ సాధించారు.. వరల్డ్‌కప్‌లో నాలుగో ప్లేస్‌లోకి దూసుకెళ్ళిన టీమ్ ఇండియా విమెన్

మహిళ వన్డే ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్ళింది. వరుస మూడు ఓటములతో డీలా పడిపోయిన భారత మహిళ జట్టు ఈ గెలుపుతో తమ సత్తా చాటుకున్నారు. న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో సెమీస్‌లోకి అడుగుపెట్టారు. 

New Update
women india

వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయారు. మరోవైపు సెమీస్‌కు మూడు జట్లు వెళ్ళిపోయాయి. ఇంక ఒక్కటే స్థానం మిగిలి ఉంది. దాని కోసం మూడు టీమ్‌లు పోటీ పడుతున్నాయి. చావో రేవో తేల్చుకోవాల్సి మ్యాచ్. అలాంటి దానిలో టీమ్ ఇండియా మహిళలు విజృంభించేశారు. న్యజిలాండ్‌ను 53 పరుగుల తేడాతో చిత్తు చేశారు. సెంచరీలతో చెలరేగిన స్మృతి మంధాన, ప్రతీక రావల్‌.. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన జెమీమా రోడ్రిగ్స్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్ గెలిచిన కీవీస్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే అదే విషయానికి వారు తర్వాత చింతిచాల్సి వచ్చింది. భారత బ్యాటర్లు విజృంభించి ఆడేశారు. స్మృతి ప్రతీకలు ముందు మ్యాచ్‌లలో వైఫల్యాన్నీ మరిచిపోయేలా అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. స్మృతి అయితే తన స్టైల్లో...అవకాశం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ 88 బంతుల్లో సెంచరీ చేసింది. ప్రతీక కూడ 122 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టింది. ఆ తర్వాత ప్రతీక ఔటైనా.. అప్పటికే క్రీజులో కుదురుకున్న జెమీమా.. ఆఖరి ఓవర్లలో చెలరేగి ఆడింది. హర్మన్‌ప్రీత్‌ (10) మరోసారి నిరాశపరిచినా.. జెమీమా మెరుపులతో భారత్‌ నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్యాన్ని అందుకోలేకపోయిన కీవీస్..

దీని తరువాత లక్ష్య ఛేదనకు దిగిన కీవీస్..చాలా బాగా బ్యాటాటింగ్ చేసినప్పటికీ టార్గెట్ మరీ పెద్దది కావడంతో దాన్ని అందుకోలేకపోయింది. దానికి తోడు భార బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జార్జియా ప్లిమ్మర్‌ (30), అమేలియా నిలకడగా ఆడి జట్టును పోటీలో నిలిపే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేపోయింది. ఆ జట్టులో బ్రూక్‌ హాలిడే (81; 84 బంతుల్లో 9×4, 1×6), ఇసబెల్లా గేజ్‌ (65 నాటౌట్‌; 51 బంతుల్లో 10×4), అమేలియా కెర్‌ (45; 53 బంతుల్లో 4×4) పోరాడారు. దానికి తోడు వర్షం పడడంతో మ్యాచ్‌ను డక్‌ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆడించారు. దీంతో 44 ఓవర్లలో 325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 8 వికెట్లకు 271 పరుగులే చేయగలిగింది. దీంతో భారత జట్టు మ్యాచ్ గెలవడమే కాక సెమీస్‌లో బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. సెమీస్‌లో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో ఆడుతుంది. 

Also Read: Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..ప్రవైట్ బస్సు దగ్ధం..30మంది మృతి

Advertisment
తాజా కథనాలు