Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..ప్రైవేట్ బస్సు దగ్ధం..30మంది మృతి

ఈరోజు తెల్లవారు ఝామున కర్నులు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న టేకూరు దగ్గర ప్రైవేట్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.  

New Update
karnool bus

చిన్న రోడ్డు ప్రమాదం మొత్తం బస్సు దగ్ధమవ్వడానికి కారణం అయింది. కర్నూలు జిల్లా శివారులో చిన్న టేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో 30  మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.  తెల్లవారు ఝామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒక స్కూటర్‌ను ఢీ కొట్టింది దీంతో బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. తరువాత అవి పూర్తిగా బస్సు అంతా వ్యాపించడంతో మొత్తం మంటల్లో దగ్ధం అయిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు నుంచి  12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగులగొట్టుకుని బయటపడ్డారు. వీరందరూ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. 

40 మంది ప్రయాణికులు

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఈప్రమాదం చోటు చేసుకుంది.  ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ప్రత్యక్ష సాక్షులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు