/rtv/media/media_files/2025/02/15/QTMP42nTZYIgqlcbq1g0.jpg)
ravichandran ashwin lambasts superstar culture within Indian team
భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. టీమిండియా ప్లేయర్లను ఉద్దేశించే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతున్నారు. తాజాగా భారత క్రికెట్‌లో పెరిగిపోతున్న సూపర్ స్టార్ల సంస్కృతిని అతడు తప్పుబడుతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత క్రికెటర్లు.. నటులు, సూపర్ స్టార్లు కాదని ఆయన అన్నారు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
క్రికెటర్లు క్రీడాకారులు మాత్రమే
తాజాగా ఒక హిందీ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లు కేవలం క్రీడాకారులు మాత్రమేనని అన్నారు. టీమ్ ఇండియా క్రికెట్‌లో ఎన్నో అంశాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో ముఖ్యంగా జట్టులో ఉన్నవారు ఎవరు కూడా ఇలాంటి స్టార్ కల్చర్‌ను ప్రోత్సహించకూడదని చెప్పుకొచ్చారు.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
సెంచరీ చేస్తే గొప్పతనమేమీ కాదు
ఎంతటివారైనా సాధారణ ప్రజల మాదిరిగానే వారి జీవన విధానం సాగించాలని కోరారు. అంతేకాకుండా.. టీంలో ఎవరైనా ప్లేయర్ సెంచరీ చేస్తే అది అతడి గొప్పతనమేమీ కాదని అన్నారు. అది క్రీడాకారుల రోజు వారీ జీవితంలో భాగమేనని గుర్తుంచుకోవాలన్నారు. అదే సమయంలో మన లక్ష్యాలు వీటి కంటే కూడా మరింత ఎక్కువగ ఉండాలని సూచించారు.
Also Read : ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్
ఇదిలా ఉంటే ఇటీవల కూడా ఆయన ఓ విషయంలో స్పందించారు. త్వరలో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవాడాన్ని అతడు ప్రశ్నించారు. ఈ టోర్నీ కోసం భారత్ 5గురు స్పిన్నర్లను ఎందుకు తీసుకుందో తనకు అర్థం కావడంలేదన్నారు. ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లను మాత్రమే తీసుకుంటారని తాను భావించినట్లు తెలిపారు. దీంతో జట్టు విషయంలో తాను కొంత అసంతృప్తి చెందినట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.