/rtv/media/media_files/2025/10/12/australia-2025-10-12-22-54-37.jpg)
మహిళల వన్డే వరల్డ్ కప్ చాలా ఇంట్రస్టింగ్ గా జరగుతోంది. ఈరోజు వైజాగ్ లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మమ్యాచ్ జరిగింది. ఇందులో రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 84 బంతుల్లో సెంచరీ కొట్టేసి వావ్ అనిపించింది అలీసా. ఈమెతో పాటూ ఆ దేశ బ్యాటర్లు ఎలిస్ పెర్రి (47*), ఆష్లె గార్డ్‌నర్ (45), ఫోబ్ లీచ్‌ఫీల్డ్ (40) రాణించారు. సోఫీ మోలినెక్స్ (18), కిమ్ గార్త్ (14*), తాహిలా మెక్‌గ్రాత్ (12) పరుగులు చేశారు. దీంతో భారత బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది.