Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేశారు: సెహ్వాగ్‌

రోహిత్ శర్మ కెప్టెన్సీని చాలామంది తక్కువ అంచనా వేశారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. రోహిత్ సారథ్యంలో గత 9నెలల వ్యవధిలో టీమ్‌ఇండియా రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిందన్నారు. రెండు ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకొని సత్తా చాటిందని ప్రశంసించారు.

New Update
Team India Former cricketer Virender Sehwag praises Rohit Sharma captaincy

Team India Former cricketer Virender Sehwag praises Rohit Sharma captaincy

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌కు దక్కింది. అయితే ఇది వరుసగా రెండో ట్రోఫీ కావడం గమనార్హం. 9 నెలల ముందే టీ20 ట్రోఫీని భారత్ కైవసం దక్కించుకుంది. 

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

ఇక ఇప్పుడు మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది.  ఇది మాత్రమే కాకుండా.. గత వరల్డ్ కప్‌లోనూ భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇలా భారత్‌కు పలు ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ బెస్ట్ కెప్టెన్ అంటూ పొగడ్తల్లో ముంచేస్తున్నారు. తాజాగా రోహిత్ కెప్టెన్‌ని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందించాడు. టీమిండియాకు సారథిగా వ్యవహరించిన తీరు అత్యద్భుతమని అన్నాడు. 

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

బెస్ట్ కెప్టెన్ రోహిత్

రోహిత్ కెప్టెన్సీని చాలా మంది తక్కువ అంచనా వేశారని.. కానీ అతడు వరుసగా భారత్‌కు రెండు ట్రోఫీలను అందించాడని కొనియాడారు. దీంతో ధోనీ తర్వాత ది బెస్ట్ కెప్టెన్ రోహిత్ అని తెలిపాడు. తన బౌలర్లను వినియోగించుకునే విధానం.. జట్టును హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుందని ప్రశంసించాడు. అదే సమయంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయిన ప్లేయర్లను సముదాయించడం చాలా బాగుందని అన్నాడు. అవకాశం రాని వారికి సర్ది చెప్పిన తీరు తనకు ఎంతో బాగా నచ్చిందని అన్నాడు. 

Also Read: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

మొదటి మ్యాచ్‌లో అర్ష్ దీప్‌ సింగ్‌ను కాదని హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చాడని.. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇచ్చాడని తెలిపాడు. ఇదే అతడిని ది బెస్ట్ కెప్టెన్‌గా నిలిపిందని చెప్పుకొచ్చాడు. అతడు తనకంటే.. తన జట్టుకోసం, సహచరుల కోసం ఎక్కువగా ఆలోచించే కెప్టెన్ అని కొనియాడాడు.

Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

ముఖ్యంగా ఎవరైనా ప్లేయర్ అభద్రతాభావంతో ఉంటే వారు సరైన పెర్మార్మ్ చేయలేరని తనకు తెలుసని.. అందువల్లే ఎవరూ అలా ఉండకుండా రోహిత్ చర్యలు తీసుకుంటాడని అన్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ రోహిత్ బాగా పనిచేస్తున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు