Subhman Gil: సచిన్ కూతుర్ని వదిలేసినట్టేనా.. కొత్త అమ్మాయితో గిల్ డేటింగ్!

టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ టీవి నటి అవనీత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దుబాయ్ ఇండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కి వెళ్లింది. కేవలం గిల్ కోసమే వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

New Update
Subhman Gil

Subhman Gil Photograph: (Subhman Gil)

టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ టీవీ నటితో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. టీవీ నటి అయిన అవనీత్ కౌర్‌తో శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల దుబాయ్‌లో ఆస్ట్రేలియా, టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కి అవనీత్ వెళ్లింది. స్టేడియంలో ఎంజాయ్ చేసినట్లు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ కోసమే ఆమె మ్యాచ్ చూడటానికి వెళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్..

అవనీత్ కౌర్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లోనూ కనిపిస్తోంది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్, మేరీ మా వంటి వాటిలో నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటుంది.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు