/rtv/media/media_files/2024/10/22/zGxCxZ7DDxJRIoHlTItf.jpg)
SARFARAZ KHAN
SARFARAZ KHAN : భారత జట్టు క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అయ్యారు. అతని భార్య రోమానియా అక్టోబర్ 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్ఫరాజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజు(26) ముందే సర్ఫరాజ్ కొడుకు రూపంలో అందమైన బహుమతిని అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా అభిమానులు అతనికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సర్ఫరాజ్ గతేడాది ఆగస్టు 6న రోమానా జహూర్ వివాహం చేసుకున్నారు. రొమానా, సర్ఫరాజ్ తొలిసారి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కలిశారు.
Also Read: Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ 'భార్గవి నిలయం' - Rtvlive.com
Sarfaraz Khan is blessed with a baby Boy ❤️
— Johns. (@CricCrazyJohns) October 21, 2024
- Congratulations to Sarfaraz & his wife. pic.twitter.com/3QIQYKvPhX
న్యూజిలాండ్ మ్యాచ్ లో కీలక పాత్ర
సర్ఫరాజ్ ఖాన్ ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 150 పరుగులతో ఇన్నింగ్స్ తేడాతో టీమ్ ఇండియాను ఓటమి నుంచి రక్షించడంలో సహాయపడ్డాడు. సర్ఫరాజ్ ఫిబ్రవరి 2024 రాజ్‌కోట్‌లో ఇంగ్లాడ్ తో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే 62 పరుగులు చేసి సత్తాచాటాడు. ఇప్పటికీ సర్ఫరాజ్ తన క్రికెట్ కెరీర్ లో టీమ్ ఇండియా కోసం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా చేశాడు. .
Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్
Also Read: మణికంఠ AV ఎందుకు ప్లే చేయలేదు..? కారణం ఇదేనా
Also Read: ఆ కళ్ళు చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేరు.. వైట్ డ్రెస్ లో హాట్ బేబీ క్యూట్ లుక్స్ న్యూజిలాండ్ మ్యాచ్ లో కీలక పాత్ర