మణికంఠ AV ఎందుకు ప్లే చేయలేదు..? కారణం ఇదేనా

బిగ్ బాస్ 8 ఏడో వారం ఎలిమినేషన్‍లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓటింగ్ ఆధారంగా కాకుండా మణికంఠ స్వయంగా తానే హౌస్ నుంచి వెళ్లిపోతానని సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకున్నాడు. దీంతో తనకంటే లీస్ట్ ఓటింగ్ వచ్చిన గౌతమ్ సేవ్ అయిపోయాడు.

New Update

Bigg Boss Telugu 8:  బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో 8 వారం లోకి అడుగుపెట్టింది. అయితే నిన్న ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. చివరిగా మణికంఠ, గౌతమ్ మధ్య చివరి ఎలిమినేషన్ ప్రక్రియ జరగగా.. అందరికీ పెద్ద షాకిచ్చాడు. ఇక నేను గేమ్ ఆడలేను, నావల్ల కాదు..  అని సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు మణికంఠ. 

ఓటింగ్ ప్రకారం మణికంఠ సేఫ్ 

అయితే ఓటింగ్ ప్రకారం చూస్తే మణికంఠ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలిసింది. కానీ తాను హౌస్‍లో నుంచి వెళ్లాలనుకుంటున్నట్టు మణికంఠనే స్వయంగా చెప్పడంతో బిగ్ బాస్ తన నిర్ణయాన్ని అంగీకరించి బయటకు పంపారు. దీంతో మని తర్వాత లీస్ట్ ఓటింగ్ లో ఉన్న గౌతమ్ సేవ్ అయిపోయాడు. 

మణికంఠ AV ఎందుకు ప్లే చేయలేదు

ఎలిమినేషన్ తర్వాత ప్రతీ కంటెస్టెంట్  AV ని తప్పకుండా స్టేజ్ పై ప్లే చేస్తారు. కానీ నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో మాత్రం మణి AV ప్లే చేయకపోవడం ప్రేక్షకుల్లో కొత్త సందేహానికి దారితీసింది. AV ప్లే చేయలేదంటే మణి మళ్ళీ రీ ఎంట్రీ ఛాన్స్ ఏమైనా ఉందా? అని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మణి రీ ఎంట్రీ ఉండే అవకాశం ఏ మాత్రం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ లోకి 8 వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే షో లెంగ్త్ పెరిగిపోతుంది. కావున రీ ఎంట్రీ ఉండకపోవచ్చు. మరి AV ప్లే చేయకపోవడానికి కారణం ఏంటీ అంటే..? ఈ వారం ఓటింగ్ ప్రకారం మణికంఠ సేఫ్ జోన్ లోనే ఉండడంతో టీమ్ అతని AV ని ప్రిపేర్ చేసి ఉండకపోవచ్చు. 

Also Read: హార్పర్స్ బజార్ అవార్డు వేడుకల్లో.. అనన్య అందాలు చూస్తే మతిపోవాల్సిందే !

Advertisment
Advertisment
తాజా కథనాలు