Amaran Sivakarthikeyan
Siva karthikeyan: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్'. ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ కథ ఆధారణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, స్టార్ హీరో కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!
''థ్యాంక్యూ అన్నా''
అయితే ఈ ఈవెంట్ లో శివకార్తికేయన్.. సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివకార్తికేయన్ మాట్లాడుతూ.. "నేను ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తున్నప్పుడు సాయి పల్లవిని తొలిసారి కలిశాను. అప్పటికే పల్లవి ఢీ షో ద్వారా సాయి పల్లవి చాలా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత పల్లవి నటించిన 'ప్రేమమ్' సినిమా చూసి షాక్ అయ్యాను. సినిమాలో తన నటన బాగా నచ్చేసింది. వెంటనే ఫోన్ చేసి పల్లవిని ప్రశంసించాను. అయితే అప్పుడు సాయి పల్లవి ''థాంక్యూ అన్న'' అని చెప్పింది. దీంతో ''అన్న'' అని మాత్రం అనకండని సాయిపల్లవికి చెప్పాను" అంటూ సరదాగా ఆ సంఘటనను గుర్తుచేశారు శివ కార్తికేయన్.
Also Read: బిగ్‌బాస్‌లో మత రచ్చ! మెహబూబ్, నబీల్ ఇద్దరికీ రెడ్ కార్డు.. నెటిజన్ల ట్రోల్స్
SaiPallavi: Thank You Annaaaa
— AmuthaBharathi (@CinemaWithAB) October 19, 2024
Sivakarthikeyan: Anna nu mattum sollatha😂❤️#Amaran pic.twitter.com/TbpXRuEQ1Z
Also Read: ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!
Also Read: ఫెమినా మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే