Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ 'భార్గవి నిలయం' మలయాళ హీరో టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ ‘నీల వెలిచం’. తెలుగులో 'భార్గవి నిలయం' పేరుతో విడుదలైంది. ఈ చిత్రం దాదాపు ఏడాది తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. By Archana 08 Sep 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bhargavi Nilayam: మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా ఆషిక్ అబు తెరకెక్కించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ ‘నీల వెలిచం’. తెలుగులో ఈ చిత్రాన్ని భార్గవి నిలయం పేరుతో విడుదల చేశారు. గతేడాది ఏప్రిల్ 20న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు ఏడాది తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా 'తెలుగు వెర్షన్ భార్గవి నిలయం' ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో సెప్టెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్, షైన్ టామ్ ప్రధాన పాత్రలో నటించగా.. రాజేశ్ మాధవన్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్, చెంబన్ వినోద్ జోస్, వెలియనాడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక థియేటర్స్ ఈ సూపర్ హిట్ థ్రిల్లర్ ను మిస్సైన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. The line between good and evil is blurred in this gripping sci-fi crime thriller “SIMBAA (The Forest Man)#Simbaa Stream Now on @ahavideoin & Amazon Prime Every heart has a tomb! Every heart has a graveyard! Tomb of love! Graveyard of love 💓-Bhargavi Nilayam#BhargaviNilayam… pic.twitter.com/rDoJhwM44j — Let's X OTT GLOBAL (@LetsXOtt) September 6, 2024 Also Read: Devara Trailer: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. రెండు రోజుల్లో 'దేవర' ట్రైలర్..! - Rtvlive.com #bhargavi-nilayam-ott #bhargavi-nilayam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి