BIG BREAKING: నెల్లూరులో స్కూల్ బస్సు బోల్తా!

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తడలోని బోడి లింగాల పాడు వద్ద చిన్నారులు వెళ్తున్న నారాయణ స్కూల్ బస్ బోల్తా పడింది. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

New Update
School bus overturns

School bus overturns

Nellore District:  ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ సమీపంలోని బోడి లింగాల పాడు దగ్గర ఘోర  ప్రమాదం చోటుచేసుకుంది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం  జరగగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో తడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

డ్రైవర్ నిర్లక్ష్యం 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బస్సుకు సంబందించి చాసిస్ విరిగిపోవడంతో కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. ఏదేమైనా జరగరానిది జరిగి ఉంటే 30 మంది పసిపిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. 

Also Read :  బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్‌ రాసలీలలు

ఇటీవలే మరో బస్సు ప్రమాదం 

ఇది ఇలా ఉంటే ఇటీవలే నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం, మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు