SRH vs LSG : ఉప్పల్లో హై ఓల్టేజ్ మ్యాచ్..సన్‌రైజర్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్!

ఉప్పల్ స్టేడియం వేదికగా మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడగా.. LSG మూడు, SRH ఒకసారి మాత్రమే గెలిచింది.

New Update
srh-vs-lsg 7th

ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.  ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచిన ఊపుతో సన్‌రైజర్స్ ఉండగా.. తొలి విక్టరీ కొట్టాలనే కసితో  లక్నో జట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  రాత్రి7:30 గంటలకు  మ్యాచ్ ప్రారంభం కానుంది.

Also Read :  అమెరికాలో RWA పై ఆంక్షలు..!

గత రికార్డులను పరిశీలిస్తే..  

ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నాలుగు సార్లు తలపడగా..  ఇందులో లక్నో జట్టుదే పైచేయిగా ఉంది.  లక్నో మూడు సార్లు గెలువగా.. సన్‌రైజర్స్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని సన్‌రైజర్స్ అభిమానులు కొందరు టెన్షన్ పడుతున్నారు. మరికొందరు మాత్రం సన్‌రైజర్స్ ఉన్న స్పీడును ఎవరూ ఆపలేరని కామెంట్స్ చేస్తున్నారు.  

ఇక మొత్తం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ 58 మ్యాచ్‌లు ఆడితే అందులో 36 మ్యాచ్‌లలో విజయం సాధించగా..  21 మ్యాచ్‌లలో ఓడిపోయింది.  మరో మ్యాచ్ టైగా ముగిసింది.  ఈ స్టేడియంలో సన్‌రైజర్స్ హైయెస్ట్ స్కోర్ 286 పరుగులు.. రాజస్థాన్ రాయల్స్‌పై చేసింది. ముంబై ఇండియన్స్‌పై 2019లో 96 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదే లోయెస్ట్ స్కోర్.  

Also Read :  వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్

Also Read :  బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!

జట్ల అంచనా.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ :  పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

లక్నో సూపర్ జెయింట్స్ :   రిషబ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మర్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరాన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోనీ, శార్థూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్.

Also read :  పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!

 

srh-vs-lsg | ipl-2025 | sunrisers-hyderabad | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు