Ind vs Aus: అతడొక ప్యాకేజీలాంటి బౌలర్.. బుమ్రాను టార్గెట్ చేసిన స్మిత్

బుమ్రా బౌలింగ్ పై స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం క్రికెట్ యుగంలో బుమ్రా ఒక ప్యాకేజీలాంటి బౌలర్ అంటూ పొగిడేశాడు. బంతి విసిరే తీరు ఎల్లప్పుడూ కొత్తగా ఉంటుందన్నాడు. బుమ్రా బౌలింగ్ ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదన్నాడు. 

author-image
By srinivas
New Update
rerereee

Jaspreet Bumrah : భారత బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్ పై ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం క్రికెట్ యుగంలో బుమ్రా ఒక ప్యాకేజీలాంటి బౌలర్ అన్నాడు. బుమ్రా బౌలింగ్ ఎన్నిసార్లు ఆడినప్పటికీ తాను ఇంకా అలవాటు పడలేదని, ఇంకా సమయం పట్టేలా ఉందంటూ తెగ పొగిడేశాడు. ఈ మేరకు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఇందులో భాగంగానే మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న స్మిత్..  బుమ్రాది ఒక విచిత్రమైన శైలిగా పేర్కొన్నాడు. 

Also Read: తెలంగాణలో అత్యత్తమ MSME విధానం తీసుకొచ్చాం

Also Read :  ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!

అనుకున్న దానికంటే వేగంగా దూసుకొస్తుంది..

'బుమ్రా రనప్‌ విచిత్రంగా ఉంటుంది. బంతి విసిరే తీరు ఎల్లప్పుడూ కొత్తగా ఉంటుంది. ఇప్పటికి తన బౌలింగ్‌కు అలవాటు పడలేకపోతున్నా. లయ అందుకోవడం కష్టంగా ఉటుంది. బంతి బ్యాట్ దగ్గరగా వేస్తాడు. దానిని మనం గమనించాలనుకున్నలోపే అనుకున్న దానికంటే వేగంగా దూసుకొస్తుంది. అదే అతని గొప్ప నైపుణ్యం. రెండు వైపులా బంతి స్వింగ్‌ చేయగలడు. రివర్స్‌ స్వింగ్‌ మీదా మంచి పట్టుంది. బౌన్సర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు' అంటూ తెగ పొగిడేశాడు. 

ఇది కూడా చదవండి: దేశానికే అవమానం.. బంగ్లాదేశ్ విద్యార్థులు ఇండియా జాతీయ జెండాపై..

ఇక పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా బుమ్రా బంతులను తట్టుకోలేక ఆసీస్ బ్యాటర్లు అల్లాడిపోయారు. ప్రతి బాల్ గండంగానే భావిస్తూ గజగజ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో మొత్తం 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 

ఇది కూడా చదవండి: కండోమ్‌లతో పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు