నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

SA vs IND
New Update

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు మొదటి మ్యాచ్ జరగనుంది. రాత్రి  8.30 గంటలకు డర్బన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం కష్టమే.

ఇది కూడా చూడండి: Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకించేందుకు రెడీ అయిన ట్రంప్‌..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. దక్షిణాఫ్రికా పిచ్ కాస్త కఠినంగా ఉంటుంది. ఈ పిచ్‌లో ఆటగలిగితే.. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆడగలరట. అయితే ఈ టీ20 సిరీస్‌లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో యవ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో ఎలా తలపడతారో చూడాలి. 

ఇది కూడా చూడండి: Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..

ఈ టీ20 జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వారి ప్రతిభను చూపించుకోవడానికి ఈ సిరీస్ మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడటం అంత సులువేం కాదు. అయితే దక్షిణాఫ్రికా జట్టులో కూడా ఈసారి ఎక్కువగా కుర్రాళ్లే ఉన్నారు. కెప్టెన్, క్లాసెన్, మిల్లర్, కేశమ్ మాత్రమే సీనియర్లు ఉన్నారు. మిగతా వారంతా యువ ఆటగాళ్లే. ముఖ్యంగా వీరిలో బౌలింగ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు. సీనియర్ క్రికెటర్లు కూడా ఎలా ఆడుతారో కొత్త చెప్పక్కర్లేదు. 

ఇది కూడా చూడండి:  Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్

తుది జట్లు

భారత్‌: అభిషేక్, శాంసన్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్, రింకు, అక్షర్, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్, అవేష్‌ ఖాన్, యశ్‌ దయాళ్‌.

దక్షిణాఫ్రికా: రీజా, రికిల్‌టన్, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), క్లాసెన్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, కేశవ్, ఎంగబా పీటర్, బార్ట్‌మన్, కొయెట్జీ.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా

#cricket #t20-series #sa-vs-ind
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe