/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
H1B Visa
అమెరికాలో గ్రీన్ కార్డులు పొందాలనుకునేవారి కల నెమ్మదిగా మాయం అవుతోంది. రోజుకో రొత్త రూల్ తో ట్రంప్ వలసదారుల భవిష్యత్తును కూల్చేస్తున్నారు. అక్రమవలసదారుల పేరు మీద స్టూడెంట్స్, హెచ్ 1 బీ వీసాదారుల కలలను కూడా నాశనం చేస్తున్నారు. తాజాగా మరో కొత్త విషయంతో అందరికీ షాక్ ఇచ్చారు. విదేశాంగ శాఖ మే 2025కి సంబంధించిన విడుదల చేసిన వీసా బులిటిన్ భారతీయ H-1B వీసా, గ్రీన్ కార్డ్ ఆశావహులకు భారీ షాకిచ్చింది. తొందరలోనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందని చూస్తున్న ఈబీ5 వీసావారకి విషయంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భారతీయులకు EB-5 అన్-రిజర్వ్‌డ్ వీసా వర్గంలో 6 నెలల కంటే వెనక్కి వెళ్లి మే 1, 2019కి చేరింది. ఇదే సమయంలో, చైనాకు సంబంధించిన తేదీ జనవరి 22, 2014 వద్ద స్థిరంగా ఉంది.
ఈబీ 1, 2, 3 ల్లో మార్పు లేదు..
ఇప్పటివరకూ 2019 నవంబర్ 1కి ముందు గ్రీన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లను ఈబీ5 వీసా వెయిటింగ్ లిస్టులో ఉంది. ఇప్పుడు 2019, మే1కి ముందు అప్లై చేసుకున్నవాళ్ల పేర్లు మాత్రమే ఈ లిస్టులో ఉంటాయి. దీంతో ఈ కటాఫ్ తేదీ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లోకి వచ్చేందుకు మరింత టైమ్ పట్టనుంది. అయితే ఈబీ 1 విషయంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఈబీ 2 (అడ్వాన్స్ డిగ్రీ ప్రొఫెషనల్స్) కేటగిరీలో ఇండియా విషయంలో గత నెలతో పోలిస్తే (2013, జనవరి 1) కటాఫ్ తేదీ కాస్త ముందుకొచ్చింది. ఇక ఈబీ 3 (స్కిల్డ్ వర్కర్స్/ప్రొఫెషనల్స్) కేటగిరీలో ఇండియా విషయంలో గత నెలతో పోలిస్తే కటాఫ్ తేదీ సుమారు 2 వారాలు అంటే 2013, ఏప్రిల్ 15 కు వచ్చింది.
today-latest-news-in-telugu | usa | h1-b visas | green-card
Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!