Sachin Tendulkar: 100 సెంచరీలకు 13 ఏళ్లు.. ఒక సెంచరీ కోసం 369 రోజుల నిరీక్షణ!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుకు 13 ఏళ్లు నిండాయి. ‘గాడ్ ఆఫ్‌ క్రికెట్‌’గా పిలవబడే మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీల చరిత్ర ఇదే రోజున (2012 మార్చి 16)న నమోదైంది. 99 తర్వాత ఒక సెంచరీ కోసం 369 రోజుల (23 మ్యాచ్‌లు) నిరీక్షణ తప్పలేదు.

New Update
sachin

sachin Photograph: (sachin)

Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుకు 13 ఏళ్లు నిండాయి. ‘గాడ్ ఆఫ్‌ క్రికెట్‌’గా పిలవబడే మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీల చరిత్ర ఇదే రోజున (2012 మార్చి 16)న నమోదైంది. 99 తర్వాత ఒక సెంచరీ కోసం 369 రోజుల (23 మ్యాచ్‌లు) నిరీక్షణ తప్పలేదు. అయినప్పటికీ ఈ సెంచరీతో క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు సచిన్. ఇప్పటికి 100 సెంచరీల రికార్డు చెక్కు చెదరకపోవడం గమనార్హం. 

100వ సెంచరీకోసం నిరీక్షణ..

ఈ మేరకు ఆసియా కప్‌లో భాగంగా 2012 మార్చి 16న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సచిన్ (114; 147 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో మెరిశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. అయితే 99 సెంచరీలు చేసిన సచిన్ కు 100వ సెంచరీకోసం చాలా సమయం పట్టింది. ఈ ఒక్క సెంచరీ కోసం దాదాపు 23 మ్యాచ్ లు 369 రోజుల సమయం పట్టింది. కానీ ఈ మ్యాచ్‌ లో భారత్ ఓటమిపాలైంది. భారత్ 289/5 స్కోరు చేయగా బంగ్లాదేశ్‌ 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది. 

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

ఇదిలా ఉంటే.. నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ మ్యాచ్ నేడు షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్స్‌కి మొదట టీమిండియా చేరగా, తర్వాత వెస్టిండీస్ చేరింది. ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలకంపై వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి గెలిచింది.క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్‌ ఈ ఇండియా మాస్టర్స్‌ లీగ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు