/rtv/media/media_files/2025/04/11/qB24vlGg6W6Be8TMwodk.jpg)
rcb-vs-dc
ఐపీఎల్ 2025 లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓటమి పాలైంది. బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 163 పరుగులు చేయగా.. ఢిల్లీ జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 97 పరుగులతో జట్టును దగ్గరుండి గెలిపించాడు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ జట్టు టాప్ 2 లో కొనసాగుతోంది.
అయితే ఈ మ్యాచ్ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ జట్టు సొంత గ్రౌండ్లో పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదికలో అత్యధిక సార్లు (45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ గా ఉండే సొంత గ్రౌండ్లోనే ఇలా ఓటములు ఎదురుకోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ (44), కేకేఆర్ (38), ముంబై (34), పంజాబ్ (30) గా ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ హోమ్ గ్రౌండ్ లో భారీగానే ఓటములు ఎదురుకున్నాయి.
కోహ్లీ సరికొత్త రికార్డు
మరోవైపు బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 1,000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచులో మూడు బౌండరీలు బాదడంతో ఈ ఘనత అందుకున్నాడు. దీంతో మొత్తంగా ఐపీఎల్ లో 280 సిక్సర్లు, 721 ఫోర్లు బాదారు. తర్వాతి స్థానాల్లో ధవన్(920), వార్నర్(899), రోహిత్(885), గేల్(761)లు ఉన్నారు.
Star Indian batter Virat Kohli entered his name in the history books on Thursday (April 10) by becoming the first player in the world to hit 1000 boundaries in the cash-rich Indian Premier League. pic.twitter.com/Or1QQrhQgX
— Sozoo Today (@SozooToday) April 10, 2025
Also read : Live in relationship: పెళ్లి కాకుండా తల్లిదండ్రులైన వారికి హైకోర్టు గుడ్‌న్యూస్