/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Allahabad-HC.jpg)
గుజరాత్ హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇస్తూ.. సంచలన విషయం వెల్లడించింది. 18ఏళ్ల పైబడి ఉన్న వారు ఎవరైనా సరే పెళ్లి కాకుండా తల్లిదండ్రులైతే వారు ఇతరులతో కలిసి సహజీవనం చేయడం తప్పు కాదని అలహబాద్ హైకోర్టు చెప్పింది. వేరు వేరు మతాలకు చెందిన ఓ ప్రేమ జంట సహజీవనం చేస్తున్నారు. వారికి పెళ్లి కాలే.. కానీ ఓ బిడ్డ జన్మించారు. అందులో మహిళలకు పెళ్లై భర్త చనిపోయాడు. తర్వాత ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మాజీ భర్త తల్లిదండ్రుల ఆ జంటను బెదిరింపులకు గురిచేస్తున్నారు. బెదిరింపులు వస్తున్నాయని ఆ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జస్టిస్ శేఖర్ బి సరాఫ్, జస్టిస్ విపిన్ చంద్ర దీక్షిత్ లతో కూడిన డివిజన్ బెంచ్ విలక్షణ తీర్పు ఇచ్చింది.
ఆ పిటిషన్‌ను విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టు మతాంతర సహజీవన జంటకు పోలీసు రక్షణ కల్పించింది. పెద్ద వయసు వ్యక్తులు "వివాహం చేసుకోకపోయినా" కలిసి జీవించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులను కూడా కోర్టు ఉదహరించింది. ఆ బిడ్డ తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారని, 2018 నుండి కలిసి జీవిస్తున్నారని పేర్కొంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భర్త మరణం తర్వాత ఆ మహిళ మరో వ్యక్తితో సహజీవనం చేసి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు ఆమె మాజీ అత్తమామల నుండి బెదిరింపులు వచ్చాయి.
Also read: రూ.63కోట్ల స్కామ్ బయటపెట్టిన ఈడీ.. బ్యాంక్ మాజీ చైర్మెన్ అరెస్ట్