భారీ సిక్సు కొట్టి గుండెపోటుతో చనిపోయాడు..VIDEO VIRAL

పంజాబ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టిన తర్వాత హర్జీత్ సింగ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

New Update
punjab

పంజాబ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టిన తర్వాత హర్జీత్ సింగ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు హర్జీత్ సింగ్ భారీ సిక్స్ కొట్టాడు. సిక్స్ కొట్టిన వెంటనే అతను పిచ్ మధ్యలో కూర్చుని, ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి క్రీడాకారులు వెంటనే అప్రమత్తమై అతడికి సీపీఆర్ (CPR) చేశారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రికి చేరుకునేలోపే హర్జీత్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.అధిక శారీరక శ్రమ కారణంగానే అతనికి గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

Also Read : అన్నా వదినా అంటూ ఫ్రెండ్ లవర్తో సరసాలు.. స్వాతి కేసులో బిగ్ ట్విస్ట్!

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్రికెట్ వర్గాలను దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, హర్జీత్ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన యువకుల్లో గుండెపోటు మరణాలపై ఆందోళన రేకెత్తిస్తోంది. సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది. 2024జనవరిలో నోయిడాకు చెందిన ఒక ఇంజనీర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అదే సంవత్సరం, నవంబర్‌లో ఇమ్రాన్ పటేల్ అనే 35 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెటర్ 2024 నవంబర్‌లో పూణే స్టేడియంలో స్థానిక లీగ్ గేమ్ ఆడుతున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు.

Also Read : మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు