Rohit Sharma: టీమిండియాలో మరో వివాదం.. రోహిత్ శర్మ Vs షమీ..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజీటీలో భాగంగా ఆసీసీతో జరగనున్న మూడో టెస్ట్‌కు షమీని తీసుకుందామని బీసీసీఐ భావిస్తుంటే.. షమీ ఫిట్‌గా లేడని రోహిత్ నో చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
rohit,.,

టీమిండియా జట్టులో అంతర్గత కలహాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ vs టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దానికి ఓ ప్రధాన కారణం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఆ కథనాలు ఏంటి.. ఎందుకు రోహిత్, షమీ మధ్య గొడవలు తలెత్తాయి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) జోరుగా సాగుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అనంతరం అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ సెకండ్ టెస్ట్‌లో ఆసీసీ బ్యాటర్ల వికెట్లు తీయడంలో భారత బౌలర్లు చాలా కష్టపడ్డారు. 

Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

వికెట్లు తీసే క్రమంలో చాలా పరుగులు ఇచ్చేశారు. అయితే ఈ మూడో టెస్ట్ నుంచి భారత్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని రంగంలోకి దించుతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీలైనంత త్వరగా బీసీసీఐ షమీని ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు షమీ ఫిట్ నెస్ విషయంలో రోహిత్ శర్మ కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. 

Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇందులో భాగంగా ఇటీవల అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఓడిపోయిన అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడాడు. అందులో మహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ ఫిట్‌గా లేనట్లుగానే మాట్లాడాడు. సయ్యద్ ముస్తఫ్ ట్రోఫీలో షమీ గాయపడ్డాడని తెలిపాడు. అతన్ని బీసీసీఐ బృందం పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. షమీకి టీమిండియాలో ఎప్పుడూ చోటు ఉంటుందని.. కానీ ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని రోహిత్ చెప్పుకొచ్చాడు. దీంతో రోహిత్ ఈ ప్రకటన చేయడంతోనే వీరిద్దరి మధ్య లొల్లి మొదలైనట్లు నేషనల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Also Read: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే!

ఇది మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా టూర్‌కు ముందు కూడా షమీ ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా కష్టపడుతున్నాడని.. కానీ అతడ్ని బలవంతంగా ఆడించడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు తెలిసింది. మరి ఈ గొడవలపై రోహిత్, షమీ స్పందిస్తారా? లేదా అనేది చూడాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు