/rtv/media/media_files/2024/12/05/ECKJAWbclOL3hFCM1ytg.jpg)
నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ వాసులు గొంతు నొప్పి, దగ్గు, కళ్ళు మంటతో బాధపడుతున్నారని లోకల్ సర్కిల్స్ నివేదిక చెబుతోంది. దీపావళిత తర్వాత ఢిల్లీ వాయు కాలుష్యం PM2.5 స్థాయిలను క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములుగా నమోదు అయింది. గత ఐదేళ్ళల్లో ఇదే అత్యంత ఎక్కువ స్థాయి అని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. పండుగకు ముందు 156.6 గా ఉండే ఇప్పుడు దాని కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉందని బోర్డు తెలిపింది. అక్టోబర్ 20 రాత్రి మరియు అక్టోబర్ 21 తెల్లవారుజామున కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుందని PTI వార్తా సంస్థ తెలిపింది.
పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు..
ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్ ,ఘజియాబాద్ లలో 42శాతం ఇళ్ళల్లో ఎవరో ఒకరు అయినా గొంతునొప్పి లేదా దగ్గుతో బాధపడుతున్నారు. దాదాపు 25% కుటుంబ సభ్యులు కళ్ళు మంట, తలనొప్పి లేదా నిద్రలేమితో బాధపడుతున్నారని ..17% మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఆస్తమా తీవ్రతరం అయిందని తెలుస్తోంది. దీంతో ఎయిర్ పొల్యషన్ నుంచి తప్పించుకునేందుకు 44శాతం మంది ఇళ్ళ నుంచి బయటకు రావడమే మానేశారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తింటూ ఇంట్లోనే ఉంటున్నారు. దాదాపు మూడింట ఒక వంతు మంది కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యల కోసం వైద్యులను సంప్రదించారని చెబుతున్నారు.
వరదలు ,పంటల ఆలస్యం కారణంగా పంజాబ్ ,హర్యానాలలో పంట వ్యర్థాలను తగలబెట్టే సంఘటనలు 77.5 శాతం తగ్గినప్పటికీ..ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగానే ఉందని ఎన్‌సీఆర్ఐ చెబుతోంది. అనేక ప్రాంతాలలో గాలి నాణ్యత సూచిక (AQI) 400 దాటింది .ఇది PM2.5 ఎక్స్‌పోజర్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయి కంటే 24 రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేయడానికి అక్కడి ప్రభుత్వం చాలా చర్యలను చేపట్టింది. అయితే అది సరిపోదని..గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద కాలుష్య నిరోధక చర్యలను కఠినంగా అమలు చేయాలని..పొగమంచు తగ్గించడానికి వాడే స్మోకింగ్ గన్‌లను వాడడం తగ్గించాలని లోకల్ సర్కిల్స్ పిలుపునిచ్చింది.
Also Read: USA: అమెరికన్లే అమెరికాను వద్దనుకుంటున్నారు..సర్వేలో షాకింగ్ నిజాలు
Follow Us