Second Test: ఈరోజు నుంచే సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్..గెలవకపోతే పరువు గంగలోకే..

సౌత్ ఆఫ్రికాతో ఈ రోజు నుంచి రెండో టెస్ట్ మొదలవనుంది. మొదటి టెస్ట్ ఘోరంగా ఓడిపోయిన టీమ్ ఇండియా రెండో టెస్ట్ లో అయినా పరువు నిలబెడతరా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు.

New Update
second test

గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ లో ఘోరంగా ఓడిపోయారు టీమ్ ఇండియా. సరేలే ఒక్కసారే కదా అనుకున్నారు. కానీ ఇప్పుుడ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో కూడా మొదటి మ్యాచ్ లో చెత్తగా ఓడిపోయారు. రెండో రోజు వరకు పైచేయిగా ఉండి..మూడో రోజు మ్యాచ్ ను ప్రోటీస్ చేతిలో పెట్టేశారు. మూడో రోజు కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే కుప్పకూలి అవమాన భారాన్ని మూటగట్టుకుంది భారత్‌. మూడో రోజు మ్యాచ్‌ను కోల్పోవడం జట్టుకు పెద్ద షాకే. దీంతో ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలయ్యే రెండో టెస్ట్ లో ఎలా అయినా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ టెస్ట్ లో ఆడకపోతే పరువు గంగలోకే..

మరోవైపు గాయాలు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఈ టెస్ట్ కూడా ఆడడం లేదు. రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారి టెస్ట్ ను నిర్వహిస్తున్న గుహవాటిలో కీలక పోరుకు సిద్ధమైంది టీమ్ ఇండియా. సీరీస్ లో ఇదే చివరి మ్యాచ్ . ఇందులో గెలిస్తే సమం అవుతుంది. లేకపోతే సఫారీల చేతిలో ఓడిపోయిన అపకీర్తి దక్కుతుంది. దీంతో రిషబ్‌ పంత్‌కు జట్టును గెలిపించి సిరీస్‌ను సమం చేయడం సవాల్ గా మారింది. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకూడదని సఫారీ జట్టు పట్టుదలతో ఉంది.

కోలకత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో పిచ్ ను స్పిన్నింగ్ కు అనుకూలంగా తయారు చేయించుకున్నారు. కానీ రెండో రోజు నుంచి అది కాస్తా ఘలక్ ఇవ్వడంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. దీనిపై కోచ్ గంభీర్ ను చాలానే విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు గుమవాటి స్టేడియంలో పిచ్ అలా ఉండదని చెబుతున్నారు. ఇక్కడి పిచ్ సమతూకంగానే ఉంటుందని అంటున్నారు. క్రితంసారిలా ఈ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లను కూడా దింపకపోవచ్చును. దీంతో అక్షర్ పటేల్ పై వేటు పడొచ్చని అంటున్నారు. సాయి సుదర్శన్‌తో పాటు పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులోకి రానున్నారు. గువాహటి పిచ్‌ పేసర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో నితీశ్‌ను ఆడించబోతున్నారు. సుదర్శన్‌ ఎప్పట్లాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయనుండగా.. గిల్‌ ఆడుతున్న నాలుగో స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ దిగుతాడు. జడేజా, సుందర్, కుల్‌దీప్‌ స్పిన్‌ బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బుమ్రా, సిరాజ్‌ కొత్త బంతిని పంచుకోనున్నారు. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు కే. ఎల్. రాహుల్, యశస్వి జైస్వాల్ లు మీద పెద్ద బాధ్యతే ఉంది. వాళ్ళిద్దరి భాగస్వామ్యం నిలబడాల్సిన 

బలంగా ఉ్న ప్రోటీస్ టీమ్..

ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో కూడా రబడా ాడటం లేదని తెలుస్తోంది. పేస్‌కు అనుకూలించే గువాహటిలో భారత్‌కు ఇది సానుకూలాంశమే. కాన బౌలర్లు మార్కె యాన్సెన్, కార్బిన్ బోష్ లతో జాగ్రత్తగా ఉండాలి. ఇక తొలి టెస్టులో భారత్‌ పతనాన్ని శాసించిన స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ను.. ఈ మ్యాచ్‌లో అయినా మన బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొంటారేమో చూడాలి. బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్‌ టెంబా బవుమాకు తోడు మార్‌క్రమ్, రికిల్‌టన్, జోర్జి, స్టబ్స్, వెరీన్‌లతో పటిష్టంగా ఉంది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన ఉత్సాహంలో.. 25 ఏళ్ల తర్వాత సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది.

Advertisment
తాజా కథనాలు