Rishab Pant: ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడటంపై రిషబ్ పంత్ భాగోద్వేగానికి లోనయ్యాడు. యుక్త వయసులోనే ఢిల్లీ జట్టులోకి వచ్చిన రిషబ్.. 2025 ఐపీఎల్ టోర్నీలో లక్నోవూ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మెగా వేళంలో లక్నోవూ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న పంత్.. భారీ ధర దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఢిల్లీలో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: ప్రముఖ గీత రచయిత కుల శేఖర్ కన్నుమూత
ఈ జర్నీ చాలా విలువైనది..
'తొమ్మిదేళ్ల ప్రయాణం ఎంతో అద్భుతం. యుక్త వయసులోనే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో జాయిన్ అయ్యాను. ఢిల్లీతో నాకు ఎన్నో ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. నిజంగానే నేను ఢిల్లీ జట్టుతో చాలా నేర్చుకున్నా. నా ఎదుగుదలలో ఢిల్లీ కీలక పాత్ర పోషించింది. ఈ జర్నీ చాలా విలువైనది. క్లిష్ట సమయాల్లో ఫ్యాన్స్ అండగా నిలిచారు. మీ ప్రేమాభిమానాలు నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అందరినీ మరింత ఉత్సాహపరిచేందుకు ప్రయత్ని్స్తా. మీ అందరికీ థ్యాంక్స్’ చెప్పాడు. ఇక వేలంలో పంత్ కోసం లఖ్‌నవూ, బెంగళూరు పోటీపడ్డాయి. చివరకు లఖ్‌నవూ రూ.27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది.
ఇది కూడా చదవండి: కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు!