ప్రముఖ గీత రచయిత కుల శేఖర్ కన్నుమూత టాలీవుడ్ లిరిక్ రైటర్ కులశేఖర కన్నుమూసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అనారోగ్యంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. కులశేఖర ఘర్షణ, వసంతం, సుబ్బు, నువ్వు నేను వంటి సినిమాలకు పాటలు రాశారు. By Archana 26 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update kula shekar షేర్ చేయండి kula shekar: టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ కుల శేఖర్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఈరోజు కన్నుమూసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. 'చిత్రం' సినిమాతో లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టిన కుల శేఖర్.. 100 సినిమాలకు పాటలు రాశారు. కెరీర్ ప్రారంభంలో దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! సూపర్ హిట్ సినిమాలకు పాటలు ఆ తర్వాత దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర కాంబోలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశారు. 'జయం, ఘర్షణ, వసంతం, సుబ్బు, నువ్వు నేను' లాంటి సూపట్ సినిమాలకు చార్ట్ బస్టర్స్ అందించారు. అయితే కొంతకాలంగా ఆయన ఆర్థిక, మానసిక స్థితి సరిగా లేదు. అతని స్నేహితులు సమాచారం ప్రకారం 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడని తెలిపారు. కుల శేఖర్ 2013 అక్టోబరు 24 న కాకినాడలో శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగలించిన కేసులో అరెస్టు అయ్యారు. ఆరునెలల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత పోలీసులు విచారణ జరపగా.. మానసిక స్థితి సరిగా లేదని తేలింది. అనంతరం అతడిని వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. ప్రముఖ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత!ప్రముఖ గీత రచయిత కులశేఖర్ హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. #Kulasekhar #Tollywood #TeluguNews #RIPKulasekhar pic.twitter.com/PkA5rX8W3P — Phani Kumar (@phanikumar2809) November 26, 2024 వయసులో ఉన్న అమ్మాయి/అబ్బాయికి నిజమైన ఐశ్వర్యం అంటే ప్రేమించినవాళ్ళని పొందడమే....(సిరి తాను గానే వచ్చి నిన్ను చేరును)."సుడిగుండం కాదురా, సుమగంధం ప్రేమరా" లాంటి సాహిత్యం మనసుతో రాసిన #కులశేఖర్ గారికి మెదడు పనిచేయకపోవడం ఏంటో?? గుళ్ళో దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏంటో?? pic.twitter.com/MU5sUDLPwn — Krishna Murali (@WrittenByKrish) August 4, 2024 Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి