కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు!

ఐపీఎల్ 2025లో కేకేఆర్ కెప్టెన్ గా అంజిక్యా రహానే బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. సారథ్య బాధ్యతల కోసమే రూ.1.75 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.   

New Update
Rahane: నా లక్ష్యం నెరవేరేదాకా ఆడుతూనే ఉంటా.. అజింక్య రహానె

KKR: ఐపీఎల్‌ మెగా వేలం ముగిసింది. ఫ్రాంఛైజీలు పోటీపడి తమకు కావాల్సిన ఆటగాళ్లను భారీ ధరలు వెచ్చించి దక్కించుకున్నాయి. దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు దొరకగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి అంశంపై ఆసక్తి నెలకొంది. గత టోర్నీలో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యారు ఈ సారి పంజాబ్ కు వెళ్లిపోగా.. షారుఖ్ టీమ్ మరే కెప్టెన్ స్థాయి ఆటగాడిని తీసుకోలేదు. వెంకటేష్ అయ్యార్ కు మాత్రమే రూ.23.75 కోట్లు వెచ్చించింది. అయితే సీనియర్లు రస్సేలు, నరైన్ తో పాటు వెంటేష్ ను కెప్టెన్ చేసేందుకు యాజమాన్యం మొగ్గు చూపట్లేదు. ఈ క్రమంలోనే తాజాగా భారత సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే పేరు తెరపైకొచ్చింది. 

ప్టెన్సీ అనుభవం దృష్టిలో ఉంచుకునే..

ఈ మేరకు మొదట అన్ సోల్డ్ గా మిగిలిపోయిన రహానేను చివరగా కోల్ కతా రూ.1.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతడికి కెప్టెన్సీ అనుభవం దృష్టిలో ఉంచుకునే చివరి నిమిషంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టును నడిపించే నాయకుడు లేడని భావించి కోల్ కతా కొనుగోలు చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రహానే 2022లో కోల్‌కతా తరఫున 7 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా మరోసారి కోల్ కతాకు తిరిగొచ్చాడు.  

సీనియర్లను కాదని.. 

కేకేఆర్ ఫ్రాంఛైజీ సీఈవో వెంకీ మైసూర్ రహానేను తీసుకోవడంపై స్పందిస్తూ.. రహానెను కెప్టెన్‌ చేయాలా? వద్దా అనే దానిపై చర్చ నడుస్తోంది. ఫ్రాంఛైజీలో భాగస్వాములంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. వేలంలో మా ప్లాన్‌ సరిగ్గానే అమలైంది. జట్టు చాలా అద్భుతంగా ఉంది. అన్ని విభాగాల్లో మంచి ఆటగాళ్లు దొరికినందుకు సంతోషంగా ఉన్నామని తెలిపారు. 

కోల్‌కతా జట్టు: 
అజింక్య రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్, వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్‌, రసెల్‌, అన్రిచ్‌ నోకియా, హర్షిత్ రాణా, రమణ్‌దీప్‌ సింగ్, క్వింటన్ డికాక్‌, రఘువంశీ, స్పెన్సర్‌ జాన్సన్, రెహ్మనుల్లా గుర్బాజ్, మొయిన్‌ అలీ, వైభవ్‌ అరోరా,  రొవ్‌మన్ పావెల్‌, ఉమ్రాన్‌ మలిక్, మనీశ్‌ పాండే, అనుకుల్‌ రాయ్‌, లవ్‌నిత్ సిసోడియా, మయాంక్‌ మార్కండే.

Advertisment
Advertisment
తాజా కథనాలు