RCB: తొక్కిసలాట ఘటన ..3 నెలల తరువాత RCB సంచలన పోస్టు!

దాదాపుగా మూడు నెలల తరువాత RCB ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు మూడు నెలల పాటు మౌనంగా ఉన్నఆర్‌సీబీ ఫ్రాంచైజీ గురువారం రోజున ఒక ఉద్వేగపూరిత పోస్ట్‌తో తిరిగి వచ్చింది.

New Update
rcb

RCB: దాదాపుగా మూడు నెలల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు మూడు నెలల పాటు మౌనంగా ఉన్నఆర్‌సీబీ ఫ్రాంచైజీ గురువారం రోజున ఒక ఉద్వేగపూరిత పోస్ట్‌తో తిరిగి వచ్చింది. "The silence wasn't absence. It was grief" అని ఒక హృదయపూర్వక ప్రకటనను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

గుండెలను ముక్కలు చేసిందని

జూన్ 4వ తేదీన జరిగిన దుర్ఘటన తమ గుండెలను ముక్కలు చేసిందని ఆర్‌సీబీ తర పోస్టులో పేర్కొంది. అప్పటి నుంచి వారు మౌనంగా ఉన్నారని, తమ మౌనం తమ దుఃఖాన్ని సూచిస్తుందని తెలిపింది. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత ఆటగాళ్లు,  యాజమాన్యం తీవ్రమైన బాధలో ఉన్నారని వెల్లడించింది. ఈ విషాదకర ఘటన తర్వాత, కేవలం ఒక ప్రకటన ఇవ్వడం కంటే, మరింత అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించుకున్నామని ఆర్‌సీబీ తెలిపింది. 

ఈ క్రమంలోనే "ఆర్‌సీబీ కేర్స్" (RCB CARES) అనే కొత్త వేదికను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ వేదిక ద్వారా అభిమానుల క్షేమం కోసం, వారికి సహాయం అందించే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించింది.  ఈ పోస్ట్ ద్వారా, తాము అభిమానుల పట్ల శ్రద్ధగా ఉన్నామని, వారి బాధను పంచుకున్నామని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తెలియజేసింది. ఇకపై వారితో కలిసి ముందుకు వెళ్తామని, కర్ణాటక గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొంది. 

Also Read: Mirai Movie Trailer: వచ్చేసిన తేజ సజ్జా మిరాయ్ ట్రైలర్.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా!

కాగా  చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట  ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కూడా కొనసాగింది. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లోRCB జట్టు తమ కలను నెరవేర్చుకుని చరిత్ర సృష్టించింది. 18 ఏళ్లుగా కప్పు కోసం ఎదురుచూస్తున్న ఆర్‌సీబీ అభిమానుల ఆశలను నిజం చేస్తూ, 2025 ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ ఈ ఘనత సాధించింది. ఈ విజయంలో రాజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ళు కీలక పాత్ర పోషించారు.

Also Read:  Central Government Scheme: మోదీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50 వేలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

#Bengaluru Stampede #royal-challengers-bengaluru #sports #cricket
Advertisment
తాజా కథనాలు