Mirai Movie Trailer: కల్కి+ఖలేజా= మిరాయ్.. ఈ ఒక్క ట్రైలర్‌లోనే ఇన్ని సినిమాలా?

యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కాంబోలో మిరాయ్ చిత్రం రాబోతుంది. సెప్టెంబర్ 12న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. 2 నిమిషాల 58 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ అదిరిపోయింది.

New Update

యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కాంబోలో మిరాయ్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. అయితే సెప్టెంబర్ 12న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. 2 నిమిషాల 58 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించగా, శ్రియ, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. వీరి పాత్రలకు ప్రాధాన్యత ఉన్నట్లు ట్రైలర్‌లో చూస్తే అర్థం అవుతోంది. సినిమాలోని డైలాగ్‌లు, వీఎఫ్‌ఎక్స్ అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Vinayaka Chavithi 2025: జైజై గణేశా..సెలబ్రిటీ వినాయకచవితి..అలరిస్తున్న ఫోటోలు

వేరే సినిమాలు చూసినట్లు అనిపిస్తుందని..

సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుందని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తెలిపారు. కాకపోతే మిరాయ్ మూవీ ట్రైలర్ చూస్తే కల్కి, ఖలేజా వంటి సినిమాలు చూసినట్లు అనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో తేజ సజ్జా తనకి తెలియని ప్రపంచం తనని నమ్ముతుందని అంటాడు. అప్పడే సరిగ్గా సాయం కోసం చూస్తున్న కొందరు ప్రజలు తేజ సజ్జాను చూస్తూ నేలపై కూర్చుంటారు. ఇదే సన్నివేశం ఖలేజాలో కూడా ఉంటుంది. హీరో  మహేష్ బాబు దేవుడని అతన్ని చూసి ప్రజలంతా దండాలు పెట్టుకుంటారు. మిరాయ్ ట్రైలర్‌లో ఈ సీన్ చూస్తే ఖలేజా మూవీ గుర్తు వస్తుందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

ఇందులో వీఎఫ్‌ఎక్స్ టాప్‌గా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కోట్లు కొల్లగొట్టడంతో పాటు అద్భుతాలు చేస్తుందని అంటున్నారు. సినిమా వీఎఫ్‌ఎక్స్ ఏఐ కాదని, రియల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీకు ఈ ట్రైలర్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. 

ఇది కూడా చూడండి: Nivetha Pethuraj : ముస్లిం వ్యక్తితో నటి నివేతా పేతురాజ్ పెళ్లి.. ఎప్పుడంటే?

Advertisment
తాజా కథనాలు