Central Government Scheme: మోదీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50 వేలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలు లోన్ అందించనుంది. అయితే ఈ స్కీమ్ గడువు గతేడాది డిసెంబర్ 31తో ముగిసింది. ఈ క్రమంలోనే గడువు తేదీని 2030 మార్చి 31 వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Modi

Modi

Central Government Scheme: వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి ప్రధాని మోదీ గుడ్ న్యూస్ తెలిపారు. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ఆర్థిక సాయం(Loans) అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలు లోన్ అందించనుంది. అయితే ఈ స్కీమ్ గడువు గతేడాది డిసెంబర్ 31తో ముగిసింది. ఈ క్రమంలోనే గడువు తేదీని 2030 మార్చి 31 వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే లక్షల మంది లబ్ధిదారులు ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకున్నారు. అయితే ఈ స్కీమ్ వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? స్కీమ్‌కి అప్లై చేయడం ఎలా? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే. 

ఇది కూడా చూడండి: Market Crash: స్టాక్ మార్కెట్ పై ఇంకా టారిఫ్ ల ఎఫెక్ట్..ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్

క్రెడిట్ కార్డు కూడా..

పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి, చిరు వ్యాపారాలకు లోన్ ద్వారా డబ్బులు ఇస్తారు. మొత్తం మూడు విడతల ద్వారా లోన్ అందిస్తారు. మొదటి విడతలో రూ.10 వేల లోన్ ఇస్తుండగా ప్రస్తుతం రూ.15 వేలకు పెంచారు. ఇక రెండో విడతలో రూ.20 వేల లోన్ ఇస్తుండగా దీన్ని రూ.25 వేలకు పెంచారు. ఈ రెండు విడతల్లో రుణాలను చెల్లించాల్సిన సమయానికి చెల్లిస్తే మూడో విడత కింద రూ.30 వేలు లోన్ ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు రూ.50 వేలకు పెంచారు. ఈ మూడో విడత కింద లోన్ తీసుకుంటే.. ఈ సమయంలో యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు పొందే అవకాశం కూడా లభిస్తుంది. దీనిని వ్యక్తిగత లేదా ఏదైనా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డులను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ద్వారా అందిస్తారు. స్ట్రీట్ వెండర్స్‌కి ఈ స్కీమ్ ద్వారా రూ.1600 వరకు క్యాష్ బ్యా్క్ లభిస్తుంది. ఈ పథకానికి అధికార వెబ్‌సైట్‌లోకి వెళ్లి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. 

Also Read: భారత్ మంచితనం.. లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్‌

ఇది కూడా చూడండి: Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో లాభాలు రావాలంటే.. ఎన్ని యూనిట్లు ఎప్పుడు అమ్మాలంటే?

Advertisment
తాజా కథనాలు