/rtv/media/media_files/2025/04/20/C1U37BGSqZF6C1pMWYKI.jpg)
kohli rcb
ఐపీఎల్‌లో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (73*), దేవ్‌దత్ పడిక్కల్ (61) రాణించారు. ఫిల్‌సాల్ట్ (1), రజత్ పటీదార్ (12) విఫలమయ్యారు. జితేశ్ శర్మ (11*) సిక్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హర్పీత్ బ్రార్, చాహల్ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. ఇప్పటికే ఇరు జట్ల మధ్య మొన్న బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా అందులో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఓటమికి బెంగళూరు జట్టు రివేంజ్ తీర్చుకున్నట్లు అయింది. కాగా ఐపీఎల్ లో ఎనిమిది మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు ఇది మూడో ఓటమి కాగా.. బెంగళూరు ఐదో విజయం అందుకుంది.
Also read : Harassment of Hijras : బరితెగించిన హిజ్రాలు..డబ్బులు ఇవ్వలేదని..అది లేపి(వీడియో)
"Jitesh: ‘Relax, I got this.’
— Vishakh (@vishakhn1510) April 20, 2025
Last ball SIX – game over!
RCB takes it home by 7 wickets! 🏏👊"#PBKS#IPL2025#RCBvPBKS#RCBvsPBKS#PBKSvRCB#PBKSvsRCB@RCBTweetspic.twitter.com/DXwnx3afqQ
పంజాబ్ కింగ్స్ 157 పరుగులు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రన్‌సింగ్ (33), శశాంక్ (31) , ఎన్‌సన్ (25*) పరుగులతో రాణించారు. ప్రియాంశ్ ఆర్య (22) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (6) విఫలమయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ , సుయాశ్ చెరో వికెట్లు తీయగా.. రొమారియో ఒక వికెట్ దక్కించుకున్నారు. భువనేశ్వర్ కుమార్, యశ్‌దయాళ్, జోష్ హేజిల్‌వుడ్ వికెట్లేమీ తీయలేదు.
Virat Kohli Chase Master#RCBvPBKS#PBKSvsRCB#ViratKohli#CSKvsMIpic.twitter.com/PzDrbYx5f4
— Vaibhav Malik (@VaibhavMal28880) April 20, 2025