/rtv/media/media_files/2025/04/24/1fU1T4CzfW4IqtBTd60w.jpg)
ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన ఆర్ఆర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా ఆర్సీబీ జట్టు బ్యాటర్లు కోహ్లీ, సాల్ట్ క్రీజ్‌లోకి వచ్చారు.
I bet that no Virat Kohli fan will pass without liking this. #ViratKohli𓃵 #IPL2025 #RCBvsRRpic.twitter.com/y7yqodJRWU
— Mufaddal Parody (@mufaddal_voira) April 24, 2025
10 ఓవర్ల స్కోర్
మొదటి నుంచి ఇద్దరూ దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లతో చెలరేగిపోయారు. తాజాగా తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి ఆర్సీబీ జట్టు 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 40*, పడిక్కల్ 10* ఉన్నారు. ఫిల్ సాల్ట్ (26) ఔట్ అయ్యాడు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
కోహ్లీ ముందు భారీ రికార్డు
కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
rcb-vs-rr | virat-kohli | latest-telugu-news | telugu-news