/rtv/media/media_files/2025/03/09/Qh8BhizTNX0Ph0NKwuOl.jpg)
rohith sharma Photograph: (rohith sharma)
చాలా రోజుల తర్వాత టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆడ్డానికి మళ్ళీ బరిలోకి వస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడేందుకు సిద్ధమౌతున్నాడు. దీంతో బీసీసీఐ రోహిత్ ను టెస్ట్ చేయనుంది. అతని ఫిట్ నెస్ లెవెల్స్ ను పరీక్షించనుంది. దీని కోసం కెప్టెన్ వచ్చే నెల 13న బెంగళూరు వెళ్ళనున్నాడు. బెంగళూరులోని సీఓఈలో అతడికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మే తరువాత ఆడని రోహిత్
మే చివర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాక రోహిత్ శర్మ ఇప్పటి వరకు మళ్ళీ ఏమీ ఆడలేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ తో జరిగిన వాటికి వెళ్ళలేదు. దీంతో మే నుంచి అతను ఖాళీగానే ఉన్నాడు. అయితే అక్టోబర్ లో ఆస్ట్రేలియా వన్డే సీరీస్ లో ఆడనున్నాడు. అందులో ఆడాలంటే రోహిత్ ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకున్నాడు. దీని కోసమే బీసీసీఐ రోహిత్ కు ఫిట్ నెస్ పరీక్ష చేయనుంది. ముందుగానే ఈ టెస్ట్ కు వెళితే తరువాత ఫుల్ గా ప్రాక్టీసులో ఉండొచ్చని అతను భావిస్తున్నాడు.
యోయో కన్నా కఠినమైనది..
భారత క్రికెటర్లను ఇంతకు ముందు ఫిట్ నెస్ ను పరీక్షించడానికి యోయో టెస్ట్ ను నిర్వహించేది. అయితే ఇప్పుడు కొత్తగా బ్రాంకో పరీక్షను ప్రవేశపెట్టింది. ఇది యోయో కంటే కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో పాస్ అయితేనే ప్లేయర్లు ఆడేందుకు అర్హత సంపాదించుకుంటారు. ఇందులో ఎత్తైన కొండల మీద ఆటగాళ్ళు పరుగెట్టాల్సి ఉంటుంది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ పరీక్ష అంత మంచిది కాదని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. దాని గురించి మొదటిసారి చెప్పినప్పుడే అర్ధమైంది...అది ఎలా ఉండబోతోందో అని. పెద్దగా ఆక్సిజన్ లేని ఎత్తైన ప్రదేశంలో పరుగెడుతుంటే ఊపిరితిత్తులు పాడైపోతాయనిపించింది అని ఏబీ చెప్పాడు.
Also Read: Shock To Trump: ట్రంప్ కు సూపర్ షాక్..టారిఫ్ లు చట్ట విరుద్ధమన్న కోర్టు