PBK VS LSG: లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో  పంజాబ్ చేతిలో లక్నో  చిత్తుగా ఓడిపోయింది. జెయింట్స్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ బ్యాటర్లు ఎడమ చేత్తో కోట్టేశారు. 

New Update
ipl

PBK VS LSG

లక్నో సూపర్ జెయింట్స్ VS పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు మంచి మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన లక్నో మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అలవోగ్గా ఛేదించేశారు. కేవలం రెండు వికెట్ల నష్టానికి లక్నో ఇచ్చిన 172 పరుగుల టార్గెట్ ను రీచ్ అయి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఎల్ఎస్జీ మొదటి నుంచీ కూడా కింగ్స్ ను కట్టడి చేయలేకపోయింది. 16 ఓవర్లలోనే మ్యాచ్ ను పూర్తి చేసింది. ఓపెనర్ గా దిగిన ప్రభమన్ సింగ్ విజృంభించేశాడు. 69 పరుగులు చేసి స్కోరును పరుగెత్తించాడు. ఇతని తరువాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  52 పరుగులు, వధేరా 43 పరుగులు చేసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు. 16 ఓవర్లలోనే విజయానికి చేరువైంది. 

బౌలింగ్, బ్యాటింగ్ అన్నింటిలో విఫలం..

ఆట ఆరంభం నుంచి లక్నో జట్టు కష్టాల్లో పడింది. వరుస వికెట్లతో సతమతమైంది. స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ జట్టు బౌలర్స్ ఒక్కో వికెట్ తీస్తూ చెలరేగిపోయారు. మార్‌క్రమ్, మార్ష్, పంత్, పూరన్ వంటి బడా బ్యాటర్లను తక్కువ సమయానికి ఔట్ చేసి స్కోర్‌ను తగ్గించారు. ఓపెనర్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ క్రీజ్‌లోకి వచ్చారు. ఫస్ట్ ఓవర్‌లోనే లక్నో జట్టుకు గట్టి షాక్ తగిలింది. మిచెల్ మార్ష్ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. అర్ష్‌దీప్ వేసిన 0.4 ఓవర్‌కు అతడు మర్కో యాన్సర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్కడ నుంచి ఈ ఇద్దరూ మంచి ఫామ్ కనబరిచారు. కానీ వరుస వికెట్లతో లక్నో కష్టాల్లో పడింది. దూకుడుగా ఆడిన మార్‌క్రమ్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఇక సిక్సర్లతో పూనకాలు తెప్పించిన పూరన్ కూడా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో స్టార్ బ్యాటర్లందరూ వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్నో జట్టు కష్టాల్లో పడింది. 20 ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

 today-latest-news-in-telugu | IPL 2025 | LSG VS PBKS | match

Also Read: Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు