/rtv/media/media_files/2025/04/26/uEYdMrf6iEHlbPwAPEZJ.jpg)
KKR Vs PBKS sports
కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ 83, ప్రియాంశ్ ఆర్య 69 రాణించారు. శ్రేయస్ అయ్యర్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్ 1 వికెట్ తీశారు.
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
ఆ తర్వాత రస్సెల్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (69) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్ సింగ్ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ (83) ఔట్ అయ్యాడు. అలా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సెన్ ఔట్, శ్రేయస్ అయ్యర్ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news