/rtv/media/media_files/2025/02/19/6ESYVEX9ObU8H3lryanR.jpg)
athlete Yashtika Acharya Photograph: (athlete Yashtika Acharya)
జిమ్‌లో బరువులు ఎత్తుతూ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ అథ్లెట్ మృతి చెందింది. 17 ఏళ్ల యష్టిక ఆచార్య 270 కేజీల బరువు ఎత్తుతూ పవర్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్‌లోనే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌లోని జిమ్‌లో చోటుచేసుకుంది. ట్రైనీ శిక్షణ ఇస్తున్న సమయంలో 270 కేజీలున్న రాడ్డు ఆమె మెడపై పడింది. దీంతో అక్కడిక్కడే యష్టిక ఆచార్య కిందపడి స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న ఇతర అథ్లెట్లు త్వరగా ఆమెపై పడిన రాడ్డును తీసివేసి CPR చేయడానికి ప్రయత్నించారు. అప్పటికే యష్టిక మరణించింది.
Also Read : సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్
ఫిబ్రవరి 18 (మంగళవారం) రాత్రి 7 గంటలకు యష్టిక ఆచార్య ఓ ప్రైవేట్ జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ దృష్యాలు చాలా భయానకంగా ఉన్నాయి.
17-year-old weightlifter Yashtika Acharya died in Bikaner, she was lifting 270 kg weight during training pic.twitter.com/kruJfmHZwW
— Rishikesh Kumar (@RishikeshViews) February 19, 2025
రాజస్థాన్ స్టేట్ పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన అల్వార్‌లో జరిగిన 29వ రాజస్థాన్ స్టేట్ సబ్-జూనియర్ మహిళల ఎక్విప్డ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో యష్టిక ఆచార్య గోల్ట్ మెడల్ గెలుచుకుంది. గోవాలో జరిగిన 33వ జాతీయ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో ఎక్విప్డ్ విభాగంలో స్వర్ణం, క్లాసిక్ విభాగంలో రజతం గెలుచుకోని యష్టక జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఆమె తండ్రి ఐశ్వర్య ఆచార్య (50) బిల్డర్. ఆయనకు యష్టికతోపాటు మరో ఇద్దరు కూతుళ్లు. అందులో ఇద్దరు పవర్ లిఫ్టర్ అథెల్ట్ చాంపియన్లే.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్