/rtv/media/media_files/2025/09/28/pakistan-2025-09-28-21-48-48.jpg)
ఆసియా కప్ ఫైనల్ లో ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దాదాపు 41 ఏళ్ళ తర్వాత ఈ రెండు టీమ్ లూ ఫైనల్ లో తలపడుతున్నాయి. దీంతో మ్యాచ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో పీల్డింగ్ లోకి వచ్చిన పాక్ ఓపెనర్లు పర్హాన్, ఫకర్ లు శుభారంభం ఇచ్చారు. వేగంగా పరుగులు చేస్తూ..స్కోరు బోర్డును పెంచారు. దీంతో పాకిస్తాన్ జట్టు బారత్ కు పెద్ద టార్గెట్ ఇస్తుందని అనుకున్నారు. కానీ పదో ఓవర్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. మొదట ఫర్హాన్ వికెట్ తీయడంతో మొదలై...వరుసగా వికెట్లు తీస్తూ పోయారు. దీంతో పాకిస్తాన్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 57 పరుగులు చేశాడు. దాని తరువాత వరుసగా పాక్ బ్యాటర్లు విఫలం అవడంతో భారత్ టార్గెట్ 147 పరుగులకు పరిమితం అయింది.