/rtv/media/media_files/2025/08/14/trump-putin-2025-08-14-07-39-20.jpg)
Trump, Putin
అమెరికా అధ్యక్షుడు ట్రంప్...పుతిన్ పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మా ఇద్దరి మధ్యా చాలా మంచి సంబంధం ఉందని అనుకున్నాను. నేను ఏదైనా చెబితే జరుగుతుందని ఆశించాను. కానీ పుతిన్ నన్ను నిజంగా నిరాశపర్చారని ట్రంప్ అన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరపడం సులభం అని భావించాను. కానీ నా ఆశలు వమ్మ అయ్యాయి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
నన్ను చాలా నిరాశ పర్చారు..
పుతిన్ చాలా మందిని చంపుతున్నాడు. దాని కంటే ఎక్కువ మందినే కోల్పోతున్నాడు...అయినా కూడా ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ సైనికుల కంటే రష్యన్ సైనికులు మరింత ఎక్కువగా చనిపోతున్నారు. ఇది తెలిసి కూడా పుతిన్ యుద్దాన్ని ముగించడం లేదు. నేను ఎంత చెప్పినా కూడా అతని బుర్రకు ఎక్కడం లేదని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. పుతిన్ తో చాలా సార్లే ఉక్రెయిన్ గురించి మాట్లాడానని..కానీ ఏమీ పట్టించుకోలేదని చెప్పారు. అమెరికా నాయకత్వాన్ని కూడా ఆయన గౌరవించడం లేదని ట్రంప్ అన్నారు. చమురు రవాణి ఆగిపోయి...దాని ధరలు తగ్గితేనే పుతిన్ దారికొస్తారని మరోసారి ఉద్ఘాటించారు. అందుకే భారత్, చైనాలపై ఒత్తిడి తీసుకొస్తున్నామని తెలిపారు.
సుంకాలు తప్పవు..
మరోవైపు భారత్ తో తన సంబంధం గురించి కూడా అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. భారత్ తో మాకు ఎప్పుడూ మంచి సంబంధాలున్నాయి. ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు. రీసెంట్ గా ఆయన పుట్టిన రోజు నాడు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. శుభాకాంక్షలు తెలియజేశాను. మా ఇద్దరి మధ్యనా మంచి స్నేహం ఉంది. ఆయన కూడా చాలా మంచి ప్రకటన చేశారు. అయినా కూడా భారత్ పై సుంకాల విషయంలో పెద్దగా ఏ మార్సూ ఉండదని ట్రంప్ అన్నారు. మరిన్ని వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాని తెలిపారు. చైనా ఇప్పుడు భారీ స్థాయిలో అమెరికాకు సుంకాలు చెల్లిస్తోంది. మరిన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నా. చమురు కొనుగోలు ఆపివేస్తేనే రష్యా దిగివస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశం ఉక్రెయిన్ తో కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలంటే భారత్, చైనాలపై ఒత్తిడి తీసుకు రావాల్సిందేనని అన్నారు.
Also Read: BIG BREAKING: ఒకేసారి రెండు దేశాల్లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలు జారీ!