ACB: ముక్కోణపు సీరీస్ నుంచి వైదొలుగుతున్నాం..ప్రకటించిన ఆఫ్ఘాన్ బోర్డు

వచ్చే నెలలో జరగనున్న పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ముక్కోణపు సీరీస్ నుంచి తాము వైదొలుగుతన్నామని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ క్రికెటర్ల చావుకు కారణమైన పాక్‌తో ఇక మీదట ఆడమని తేల్చి చెప్పింది. 

New Update
afghan

పాకిస్తాన్ హద్దులు మీరింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా ఆఫ్ఘనిస్థాన్ మీద దాడులు చేసింది. తాజాగా పాక్టికా ప్రావిన్స్‌లో అర్థరాత్రి వైమానికి దాడిచేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ర్లు మరణించారు. వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణిస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది. వారు ముగ్గురూ బీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లని వెల్లడించింది. వీరితో పాటూ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. ఉర్గున్‌లో క్రికెటర్లు అందరూ కలుస్తారని తెలిసే పాకిస్తాన్ దాడి చేసిందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. దీనిని పిరికి దాడని అభివర్ణించింది. 

ఇది క్రికెట్‌కు చాలా పెద్ద నష్టం..

పాకిస్తాన్ దాడిని తీవ్రంగా ఖండిచండంతో పాటూ ఆటగాళ్ళ మరణానికి ఆఫ్ఘాన్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఇది క్రీడా ప్రపంచం మొత్తానికి...ముఖ్యంగా క్రికెట్‌కు పెద్ద నష్టం అని అంది. తమ దేశ క్రికెటర్లు బలిదానం తర్వాత వచ్చే నెలలో జరిగే పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ముక్కోణపు టోర్నీలో పాల్గొనమని ఏసీబీ ప్రకటించింది. మరణించిన క్రికెటర్లు పాక్టికా రాజధాని షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడటానికి వెళ్లారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఉర్గున్ జిల్లాలో జరిగిన సమావేశంలో వారిపై దాడి జరిగింది. దాడిలో చనిపోయిన అమరవీరులకు అల్లాహ్ స్వర్గంలో ఉన్నత హోదాను ప్రసాదించాలని.. గాయపడిన వారికి త్వరగా కోలుకునేలా చేయాలని ఏసీబీ కోరుకుంది. ఈ క్లిష్ట సమయంలో చనిపోయిన క్రికెటర్ల కుటుంబాలకు సహనం, బలాన్ని ప్రసాదించాలని వేడుకుంది. 

అలాగే పాకిస్తాన్ దాడులను ఆఫ్ఘాన్ టీమ్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఖండించాడు. దాంతో పాటూ ముక్కోణపు సీరీస్‌లో పాల్గొనకూడదని తమ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాడు. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు మృత్యు వాతన పడడం చాలా విషాద కరమని రషీద్ అన్నాడు. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులను నిర్వహించడాన్ని కెప్టెన్ ఖండించాడు. 

Also Read: T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లు, ఫార్మాట్ ఇదే..

Advertisment
తాజా కథనాలు