/rtv/media/media_files/2025/05/17/k2bDKFzYO6zuQnKqnE7r.jpg)
Neeraj Chopra
జావెలిన్ త్రో లో భారత్ స్టార్ నీరజ్ చోప్రా కొత్త రికార్డును సృష్టిస్తూ పోతున్నాడు. దోహాలో జరుగుతున్న డైమండ్ లీగ్ లో తాజాగా మరో కొత్త చరిత్రను లిఖించాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 90.23 మీటర్లు త్రో చేసి తన అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. వెబర్ ఈ త్రోను ఆరో ప్రయత్నంలో చేశాడు. నీరజ్ తో పాటు, పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో పాల్గొన్న భారత్ కు చెందిన కిషోర్ జెనా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
Massive throw. NATIONAL RECORD
— Athletics Federation of India (@afiindia) May 16, 2025
90.23m#DohaDL @Neeraj_chopra1 pic.twitter.com/xskI1wGM41
మూడో ప్రయత్నంలో 90 మీటర్లు..
డైమండ్ లీగ్ లో మొదటి స్థానంలో నిలవాలంటే 8 పాయింట్లు రావాలి. జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ కు 8 పాయింట్లు రాగా...నీరజ్ చోప్రాకు 7ఫాయింట్లు వచ్చాయి. డైమండ్ లీగ్ 2025 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జ్యూరిచ్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌తో ముగుస్తుంది. డైమండ్ లీగ్ ఫైనల్ విజేత డైమండ్ ట్రోఫీని అందుకుంటాడు. నీరజ్ మొదటి ప్రయత్నంలో 88.44 మీటర్లు విసిరాడు. రెండవ ప్రయత్నం ఫౌల్. మూడో ప్రయత్నంలో 90.23 మీటర్లు దాటాడు. నీరజ్ చోప్రాకు 90 మీటర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. అంతేకాదు భారతీయ ఆటగాడు 90 మీటర్ల ఇన్నింగ్స్ ఆడటం కూడా ఇదే మొదటిసారి. నీరజ్ చోప్రా నాల్గవ త్రో లో 80.56 మీటర్ల దూరం త్రో చేశాడు. నీరజ్ ఐదవ ప్రయత్నం ఫౌల్. కాగా ఆరో ప్రయత్నంలో 88.20 మీటర్ల దూరం సాధించాడు.2024 పారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొనలేదు.
today-latest-news-in-telugu | javelin-thrower-neeraj-chopra sports
Also Read: Ind-pak War: రేపటితో ముగియనున్న సీజ్ ఫైర్ ఒప్పందం