MI VS GT: ముంబైని చిత్తుచేసిన గుజరాత్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబైను గుజరాత్ టీమ్ చిత్తు చేసింది.  గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది.

New Update
ipl

GT Won The Match

పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ ఈసారి ఆరంభం నుంచే బోల్తా పడుతోంది. ఇప్పటికి జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో సీఎస్కే మీద మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని చేయలేకపోయింది. సూర్య కుమార్, తిలక్ వర్మ కష్టపడినా రోహిత్ తో సహా మిగతా బ్యాటర్లు అందరూ  తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో ముంబై మ్యాచ్ ఓడిపోయింది. సూర్యకుమార్ 49 పరుగులు చేసి చివర్లో క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ముంబై ఇండియన్స్ మీద 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. జీటీ బౌలర్స్ లో సిరాజ్ కు 2, ప్రసిధ్ కృష్ణ 2, సాయి కిశోర్ 1, రబడా 1  వికెట్లు వచ్చాయి. 

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్..

అహ్మదాబాద్‌ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్‌ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లుగా వచ్చిన సాయి సుదర్శన్‌(63), శుభ్‌మన్‌ గిల్‌(38) జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 48 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దూకుడుగా ఆడుతుతున్న ఈ జోడీని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య విడదీశాడు. పాండ్య బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్ ఔటయ్యాడు.  ఆ తరువాత వచ్చిన జోస్‌ బట్లర్‌ (39) వరుస బౌండరీలతో హోరెత్తించాడు. 

సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ
 

మరో ఎండ్ లో సాయి సుదర్శన్‌ కూడా ముంబై బౌలర్లకు చిక్కకుండా బౌండరీలు బాదుతూ పరుగులు రాబాట్టాడు. దీంతో 11 ఓవర్లకు గుజరాత్ వంద మార్క్ దాటింది.  ఈ క్రమంలోనే సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అనంతరం ముజీబుర్‌ రెహమాన్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన జోస్‌ బట్లర్‌ (39) వెనుదిరిగాడు.

 today-latest-news-in-telugu | ipl-2025 | mumbai-indians | gujarat

Also Read: USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు