Tilak Varma: సొంత టీమ్‌నే ఓడిస్తున్న వర్మ.. ముంబైకి కలిసిరాని తి‘లక్’!

ముంబై జట్టుకు ఛేజింగ్ లక్ కలిసిరావట్లేదు. ఆ జట్టు ప్లేయర్ తిలక్ వర్మ హాఫ్‌సెంచరీ చేసిన ప్రతిమ్యాచ్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఛేజింగ్లో 7సార్లు హాఫ్‌సెంచరీ చేయగా ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. నిన్నటి మ్యాచులోనూ తిలక్ 56 రన్స్ చేసాడు. అదికూడా ఓటమిపాలైంది.

New Update
Mumbai Indians lost every time Tilak Varma half-century scored

Mumbai Indians lost every time Tilak Varma half-century scored

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఆర్సీబీ జట్టులో కింగ్ కోహ్లీ చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లో 67 పరుగులతో దుమ్ముదులిపేశాడు. అలాగే కెప్టెన్ రజత్ పాటీదార్ సైతం 32 బంతుల్లో 64 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

అనంతరం ఈ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటి నుంచి మంచి ఫామ్ కనబరుస్తూ వచ్చింది. కానీ మధ్యలో బెడిసికొట్టింది. ఒక్కొక్కరుగా పెవిలియన్‌బాట పట్టారు. తమ జట్టును గెలిపించడానికి తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఎంతో కష్టపడ్డారు. కానీ ఫలితం లేకపోయింది. ముంబై జట్టులో తిలక్ వర్మ భారీ స్కోర్ చేశాడు. 29 బంతుల్లో 56 పరుగులు రాబట్టాడు. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ప్రతి మ్యాచ్ ఓటమి

ఈ సీజన్‌లో తిలక్ వర్మకు ఇది తొలి హాఫ్ సెంచరీ. దీంతో అతడు తన ఐపీఎల్ కెరీర్‌లో 7వ అర్థశతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే ముంబై జట్టుకు ఛేజింగ్ అనేది కలిసి రావడంలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్ ఓటమిపాలైంది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

అతడు ఇప్పటి వరకు ఛేజింగ్‌లో ఏడు సార్లు 50 ప్లస్ స్కోర్ చేశాడు. కానీ అతడు ఈ స్కోర్ చేసిన ఏ ఒక్కమ్యాచ్ గెలవలేదు. వీటిలో రెండేసి మ్యాచ్‌లు ఆర్సీబీ, ఆర్ఆర్ పైనే ఓడిపోవడం గమనార్హం. ఇదేవిధంగా నిన్నటి మ్యాచ్‌లోనూ తిలక్ వర్మ 56 పరుగులు చేశాడు. కానీ ముంబై ఇండియన్స్ జట్టును గెలిపించలేకపోయాడు. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

(tilak-varma | IPL 2025 | mumbai-indians | latest-telugu-news | telugu-news)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు