MS Dhoni: వయసు అయిపోయింది కానీ...తర్వాత చెప్తాను, రిటైర్మెంట్ పై ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఈసీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. దానిక తగ్గట్టే వార్తలు కూడా వచ్చాయి. కానీ ధోనీ మాత్ర అలాంటి ప్రకటన చేయకుండానే సీజన్ మగించాడు. నాలుగైదు నెలల తర్వాత అంటూ మళ్ళీ మాట దాటవేశాడు. 

New Update
ఆర్మ్యాక్స్ సర్వే (జులై) : మోస్ట్ పాపులర్ టాప్-10 ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళే!

మహేంద్ర సింగ్ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి గత రెండు సీజన్లగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ మిస్టర్ కూల్ మాత్రం ఏమీ చేయడం లేదు. అసలు దాని గురించి మాట్లాడకుండా కాలం వెళ్ళదీస్తున్నాడు. ఈ సీజన్ తర్వాత కచ్చితంగా చివరి మ్యాచ్ లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు విపరీతంగా వచ్చాయి. కానీ ధోనీ మాత్రం చివరి మ్యాచ్ తరువాత మాట్లాడుతూ ఇంటిని చాలా మిస్ వుతున్నాను. ముందు రాంచీ వెళ్ళిపోతాను. నాలుగైదు నెలల తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తా అంటూ మాట దాటవేశాడు. 

నాకింకా టైమ్ ఉంది..

నాకింకా 4-5 నెలల సమయం ఉంది. తొందరపడాల్సిన అవసరమేమీ లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఆటలో కొనసాగాలంటే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటూ బాగా ఆడాలి. చాలా మంది అది లేక క్రికెట్ కు దూరం అయిపోయారు. తాను అలా కదంటూ మాట్లాడాడు.  చాలా రోజులుగా  ఇంటికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు రాంచీకి వెళ్తాను. కుటుంబంతో గడుపుతాను. బైక్ రైడ్‌ ఆస్వాదిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో సీఎస్కే చాలా బాగా ఆడిందని...విజయంతో ముగించినందుకు సంతోషంగా ఉందని ధోనీ అన్నాడు. యువ ఆటగాళ్లను చూస్తుంటే నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది. ఇటీవల వైభవ్ సూర్యవంశీ నా కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కూడా ఇలానే అనిపించింది. మా టీమ్ లోని ఆండ్రీ సిద్ధార్థ్ వయసు నాకన్నా 25 ఏళ్ళు చిన్న అని చెప్పుకొచ్చాడు. కానీ రిటైర్మెంట్ విషయం మాత్రం ఏం మాట్లాడలేదు.

today-latest-news-in-telugu | M.S Dhoni | retairment-plan | ipl

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు