/rtv/media/media_files/2025/04/27/JhOG3tXMTDmLjlr7iwaz.jpg)
Threat Mails To Gautam Gambhir
టీమిండియా హెడ్ కోచ్ గంబీర్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం గుజరాత్‌కు చెందిన జిగ్నేష్ సింగ్ పర్మార్ అనే 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. ఆ యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ వ్యక్తి గౌతమ్ గంభీర్ కు ఈమెయిల్ ఎందుకు పంపాడనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక మరేదైనా కారణం లేదా వ్యక్తి ప్రమేయం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోందని సమాచారం. పోలీసులు ఈ మొత్తం విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
Also read : India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
India: A 21-year-old from Gujarat, Jigneshsinh Parmar, is arrested for sending a threatening email to politician Gautam Gambhir.
— @GlobalGlimpse (@HimanshuSh80843) April 26, 2025
నేను నిన్ను చంపుతాను
గౌతమ్ గంభీర్ కు ఏప్రిల్ 22న రెండు ఈమెయిల్స్ ద్వారా హత్య బెదిరింపులు రాగా.. అదే రోజు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. రెండు ఈమెయిల్స్ లలో "నేను నిన్ను చంపుతాను" అని రాసి ఉంది. దీంతో గంభీర్ వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు భద్రత పెంచాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిని గంభీర్ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గంభీర్‌కు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. కాగా గంభీర్ కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. 2022లో కూడా అతనికి ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారులు అతని భద్రతా చర్యలను కఠినతరం చేశారు.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!