DC VS LSG: లక్నో తొలి ఇన్నింగ్స్ క్లోజ్.. ఢిల్లీ ముందు టార్గెట్ ఇదే!

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 210 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది. 

New Update
Lucknow Super Giants

Lucknow Super Giants

వైజాగ్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్‌లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్‌ను ఆడియన్స్ వీక్షిస్తున్నారు. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రంగంలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దుమ్ము దులిపేసింది. ఓపెనర్లుగా దిగిన మార్‌క్రమ్, మిచెల్ మార్ష్‌ మొదటి నుంచే దూకుడు ప్రదర్శించారు. 3 ఓవర్లకు స్కోరు 33/0 ఉండగా.. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ వరుసగా 4,6,4 చితక్కొట్టాడు. అలా దూకుడుగా ఆడుతున్న క్రమంలో లఖ్‌నవూ 46 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

DC Vs LSG

మార్‌క్రమ్ (15) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. అవతల ఎలాంటి బౌలర్ అయినా ఉతికి ఆరేసాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. పవర్ ప్లే ముగిసేసరికి లఖ్‌నవూ స్కోరు 64/1గా ఉంది. ఇక మిచెల్ మార్ష్‌ ఊచకోతతో 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరోవైపు నికోలస్ పూరన్ కూడా దూకుడు పెంచాడు. 

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇలా 8 ఓవర్లు.. 100 పరుగులకు చేరువైంది. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 13 ఓవర్‌లో తొలి బంతి డాట్ కాగా.. తర్వాత వరుసగా 6,6,6,6 సిక్స్‌లు, ఒక ఫోర్ బాదేశాడు. చివరిగా మిచెల్ స్టార్క్ వేసిన 14.5 ఓవర్‌కు పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నికోలస్ పూరన్ (75; 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

ఒకానొక సమయంలో 300 స్కోర్ దాటుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే స్టార్ బ్యాటర్ల చేతులెత్తేశారో.. స్కోర్ అమాంతంగా పడిపోయింది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 210 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది. 

Also Read :  గర్భధారణ సమయంలో శీతల పానీయాలు తాగవచ్చా?

latest-telugu-news | dc vs lsg prediction 2025 | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
తాజా కథనాలు