IND VS PAK: రెండు క్యాచ్ లు మిస్..ఫ్రస్ట్రేషన్ లో కెప్టెన్ స్కై

ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 లో ఈ రోజు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మరోవైపు టీమ్ ఇండియా రెండు క్యాచ్ లను మిస్ చేసింది. 

New Update
ind vs pak

ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా భారత్, పాక్ జట్లు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ కు ష్యేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మరోవైపు భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ తమ తమ జట్లలో రెండు మార్పులు చేశాయి. అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాలలో  జస్ప్రీత్ బుమ్రా,  వరుణ్ చక్రవర్తిని భారత్ జట్టులోకి తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ ఖుష్దిల్ షా, హసన్ నవాజ్ స్థానాలలో  హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షాలను తీసుకువచ్చింది.

రెండు క్యాచ్ లు మిస్.. 

లీగ్ మ్యాచ్ లో ఇండియా చేతిలో ఓడిపోయిన పాక్ జట్టు ఓడిపోయింది.. అయితే ఈ సారి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుందో ఏమో...నిలకడగా ఆడుతోంది. పాక్ బ్యాటర్లు మొదట నుంచే బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.  దానికి తోడు టీమ్ ఇండియా రెండు క్యాచ్ లను వదిలేసింది. దీంతో ఆక్ బ్యాటర్లు లైఫ్ లభించినట్టయింది.  బుమ్రా, కుల్దీప్ లు ఇద్దరూ భారీగా పరుగులను సమర్పించుకుంటున్నారు. దీంతో  పవర్ ప్లే పూర్తయ్యేసరికి  పాక్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో సైమ్ అయూబ్ 11, పర్హాన్ 31 పరుగులతో ఉన్నారు. పాక్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుండడం..తమ టీమ్ మెంబర్లు క్యాచ్ లు వదిలేయడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసహనంగా ఉన్నాడు.  

Also Read: Afghanistan: ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్

Advertisment
తాజా కథనాలు