KKR Vs CSK: కేకేఆర్ భారీ స్కోర్.. సీఎస్కే గెలిచేనా?

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కేకేఆర్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో సీఎస్కే ముందు 180 పరుగుల టార్గెట్ ఉంది. కెప్టెన్ రహానె 48 పరుగులు, పాండే 35, రసెల్ 38 పరుగులతో రాణించారు.

New Update
KKR VS CSK (1)

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కేకేఆర్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో సీఎస్కే ముందు 180 పరుగుల టార్గెట్ ఉంది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ రహానె 33 బంతుల్లో 48 పరుగులు, MK పాండే 28 బంతుల్లో 36 పరుగులు (నాటౌట్), ఆండ్రూ రసెల్ 21 బంతుల్లో 38 పరుగులతో రాణించారు.

Also Read:11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

KKR VS CSK

 మిగతావారు తక్కువ పరుగులకే తేలిపోయారు. వికెట్ కీపర్ గుర్భాజ్ 9 బంతుల్లో 11 పరుగులు, సునీల్ నరేన్ 17 బంతుల్లో 26 పరుగులు, రఘువంశీ 2 బంతుల్లో 1 పరుగు, రింకూ సింగ్ 6 బంతుల్లో 9 పరుగులు, రమణ్ దీప్ సింగ్ 4 బంతుల్లో 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి అదరగొట్టేశాడు. అన్షుల్‌ కాంబోజ్‌ 1 వికెట్, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. 

Also Read:Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

కాగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తుది జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. ఆ జట్టు వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్‌ను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో మనీశ్‌ పాండేని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎంతో కీలకం. ఇందులో గెలిస్తేనే కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. 

Also Read:యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

ఇదిలా ఉంటే కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్‌లు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా క్యాన్సిల్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండే విజయాలు సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌లు ఓడిపోయి ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 

Also Read:భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

csk-vs-kkr

Advertisment
Advertisment
తాజా కథనాలు