Virat Kohli Records : కోహ్లీ రేర్ రికార్డ్స్.. బద్దలుకొట్టే మగాడు మళ్లీ పుడతాడా?

టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ తన ఖాతాలో అరుదైన రికార్డులను నమోదు చేశాడు. ఆ రికార్డులను బద్దలు కొట్టే ఆటగాడు ఇప్పట్లో రావడం దాదాపుగా కష్టమే అనే చెప్పాలి. 

New Update
Virat Kohli Records

Virat Kohli Records

టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నాడు కోహ్లీ. ఇప్పటికే టీ20లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ కేవలం ఐపీఎల్, వన్డేలలో మాత్రమే కొనసాగనున్నాడు. ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ తన ఖాతాలో అరుదైన రికార్డులను నమోదు చేశాడు. ఆ రికార్డులను బద్దలు కొట్టే ఆటగాడు ఇప్పట్లో రావడం దాదాపుగా కష్టమే అనే చెప్పాలి.  

కోహ్లీ రేర్ రికార్డ్స్

వేగంగా 20,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం.  
వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ
టీ20ల్లో కెరీర్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు(39) చేసింది కోహ్లీ 
వన్డేల్లో 50 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడు కోహ్లీ
టెస్ట్ క్రికెట్‌లో  అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరు మీదే ఉంది.  
టీ20 మ్యాచ్‌లలో 4,000 పరుగులు సాధించిన మొదటి ఆటగాడు కోహ్లీ
టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ 7 డబుల్ సెంచరీలు సాధించాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను అధిగమించాడు.

కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్.
ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్ కోహ్లీ
ఆసియా కప్, ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన తొలి ఆటగాడు కోహ్లీ
కోహ్లీ భారత్ కు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ కూడా
మూడు ఫార్మాట్లలో 900 రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ కోహ్లీనే
మూడు ఫార్మాట్లలో అత్యధిక ప్లేయర్-ఆఫ్-ది-సిరీస్ అవార్డులు(21) అందుకున్న తొలి ఆటగాడు కోహ్లీనే  
వన్డేల్లో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు(765) పరుగులు చేసింది కోహ్లీనే 

Also read :  BIG BREAKING : టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ

 virat-kohli | india | cricket | sports | virat-kohli-records 

Advertisment
తాజా కథనాలు