BIG BREAKING : టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్  ప్రకటించాడు. రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ రిటైర్ మెంట్  ప్రకటించడం విశేషం. 

author-image
By Krishna
New Update
kohli-retirement

kohli-retirement

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు విరాట్ కోహ్లీ స్వయంగాప్రకటించాడు. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేశాడు. కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భావోద్వేగంతో ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నాడు కోహ్లీ. తాను ఎప్పుడూ తన టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని తెలిపాడు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. గత ఏడాది బార్బడోస్‌లో భారత్ ప్రపంచ కప్ విజయం తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్ళు టీ20ల నుంచి తప్పుకున్నారు. 

Gqupt8yW8AAbyWV

9,230 పరుగులు

కోహ్లీ తన టెస్టు కెరీర్ లో 123 టెస్టుల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.  స్వదేశంలో 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 55.58 సగటుతో 4,336 పరుగులు సాధించగా, విదేశాల్లో 66 మ్యాచ్‌ల్లో కోహ్లీ 41.51 సగటుతో 4,774 పరుగులు సాధించాడు. 2014 నుండి 2022 వరకు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ 68 టెస్టుల్లో 40 విజయాలు అందించాడు. సక్సెస్ రేట్  58శాతంగా ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 2018–19లో తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. 

టెస్ట్ కెప్టెన్లుగా స్టీవ్ వా (41), రికీ పాంటింగ్ (48), గ్రేమ్ స్మిత్ (53) మాత్రమే ఎక్కువ టెస్ట్ విజయాలు నమోదు చేశారు. కోహ్లీతన చివరి టెస్ట్ మ్యాచ్ నవంబర్-జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఇక గత ఏడాది కోహ్లీ 10 టెస్టుల్లో 22.47 సగటుతో కేవలం 382 పరుగులు మాత్రమే చేశాడు.  టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే కోహ్లీ నిర్ణయం వెనుక ఈ పేలవమైన ఫామ్ ఒక కారణమని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు