సచిన్‌ రికార్డు బద్ధలు కొట్టిన జో రూట్.. టెస్టుల్లో ఏకైక మొనగాడు

టెస్టుల్లో సచిన్ రికార్డును ఇంగ్లాండు బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 1625 రన్స్ చేశాడు. 

author-image
By srinivas
New Update
ererere

ROOT: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టు క్రికెట్ రికార్డు బద్ధలైంది. ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.

కేవలం 49 ఇన్నింగ్స్ ల్లోనే.. 

ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (1625 పరుగులు) పేరిట ఉండేది. సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా రూట్ 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్న జో రూట్.. 150 టెస్టులు ఆడి12,777 రన్స్ చేశాడు. ఇక మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 

ఇది కూడా చదవండి: రైతు భరోసాపై రేవంత్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన!

జో రూట్ - 1630 (49 ఇన్నింగ్స్‌లు)
సచిన్ టెండూల్కర్ - 1625 (60 ఇన్నింగ్స్‌లు)
అలిస్టర్ కుక్ - 1611 (53 ఇన్నింగ్స్‌లు)
గ్రేమ్ స్మిత్ - 1611 (41 ఇన్నింగ్స్‌లు)
శివనారాయణ్ చందర్‌పాల్ - 1580 (49 ఇన్నింగ్స్‌లు)

ఇది కూడా చదవండి: 14 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఓరుగల్లు.. మావోయిస్టుల దారెటు?

Advertisment
Advertisment
తాజా కథనాలు