రైతు భరోసాపై రేవంత్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన! రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేస్తామని చెప్పారు. సోనియా గ్యారంటీగా తాను మాటిస్తున్నాననంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 01 Dec 2024 | నవీకరించబడింది పై 01 Dec 2024 17:32 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి TG News: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేస్తామని చెప్పారు. సోనియా గ్యారంటీగా తాను మాటిస్తున్నాననంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మీడియాతో మాట్లాడారు.. అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం.. ఈ మేరకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. మారీచుల మాయమాటలు నమ్మొద్దు. సోనియాగాంధీ గ్యారంటీగా నేను చెబుతున్నా. రైతు భరోసా తప్పకుండా వేస్తాంమని చెప్పారు. 'రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశాం. అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాం. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో.. రైతు భరోసా కూడా అదేవిధంగా అమలు చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ తమకు ప్రభుత్వాన్ని అప్పగించారు. ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉందని కేసీఆర్, హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, అధికారులు ఎవరూ చెప్పలేదు. మే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆస్తులు-అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతి నెలా రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. భారీగా ఉన్న అప్పు చూసి కూడా అధైర్యపడకుండా పాలన సాగిస్తున్నామన్నారు. ఇ ఇది కూడా చదవండి: Pushpa 2 : కిస్సిక్ సాంగ్.. ఇలా ఎక్కేస్తుందేంటి మావా! ఇక కేసీఆర్ బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతు బంధు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని తెలిపారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగిందన్నారు. ఇది కూడా చదవండి: సీఎం చేయకపోతే ప్రభుత్వంలో చేరను.. షిండే సంచలన నిర్ణయం! #CM Revanth #rythu-barosa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి