/rtv/media/media_files/2024/12/29/posTc3kV6GqsaBIvfXwD.jpg)
bumrah1
ఇప్పుడు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు. బాగా అలిసిపోయాను. అందుకే ఎక్కువ సంబరాలు చేసుకోలేదు. అప్పటికే చాలా సేపు బౌలింగ్ చేశాను. శారీరకంగా అలిసిపోయాను. అందుకే ఐదో వికెట్ వచ్చాక మళ్లీ బౌలింగ్‌ను కొనసాగించడానికి తర్వాత బంతి వేసేందుకు వెళ్లిపోయా అని చెప్పాడు బుమ్రా. ఎగిరి గంతులు వేయడానికి నేనేమీ చిన్న పిల్లాడిని కాదు. మామూలుగానే సంబరాలు చేసుకోవడానికి ఇష్టపడను అన్నాడు. అయితే నా ప్రదర్శన మీద చాలా ఆనందంగా ఉన్నా అని చెప్పాడు. లార్డ్స్ టెస్ట్ లో ఐదు వికెట్లు తీసి లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ ను బద్దలుకొట్టాడు బుమ్రా. దాని తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీనిపై ప్రశ్నించగా పై విధంగా స్పందించాడు.
కపిల్ ను అధిగమించి..
ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 23 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. హ్యారీ బ్రూక్, జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ వికెట్‌లను పడగొట్టాడు. దీంతో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో బుమ్ బుమ్ బుమ్రా లెజెండరీ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. విదేశాల్లో టెస్ట్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 13వ సారి ఐదు కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 12 సార్లు ఈ ఘనత సాధించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను బుమ్రా అధిగమించాడు.
DAY 1 ➡ 1 Wicket
— Star Sports (@StarSportsIndia) July 11, 2025
𝐃𝐚𝐲 𝟐 ➡ 𝐍𝐚𝐦𝐞 𝐨𝐧 𝐋𝐨𝐫𝐝'𝐬 𝐇𝐨𝐧𝐨𝐮𝐫𝐬 𝐁𝐨𝐚𝐫𝐝 🎖@Jaspritbumrah93, yet again, stole the show with a fiery 5/74 on Day 2 & etched his name into Lord’s rich legacy 💪#ENGvIND 👉 3rd TEST, DAY 3 | SAT, 12th JULY, 2:30 PM | Streaming on… pic.twitter.com/X3jqiobSko